రిలయన్స్‌ నావల్‌కు ఫలితాల షాక్‌

రిలయన్స్‌ నావల్‌కు ఫలితాల షాక్‌

గతేడాది(2017-18) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో అనిల్‌ అంబానీ గ్రూప్‌ సంస్థ రిలయన్స్‌ నావల్‌ ఇంజినీరింగ్‌ కౌంటర్లో ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు తెరతీశారు. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 6 శాతం పతనమై రూ. 25.35 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 24.50 వద్ద 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది.
భారీ నష్టాలు
క్యూ4(జనవరి-మార్చి)లో రిలయన్స్‌ నావల్‌ దాదాపు రూ. 409 కోట్లమేర నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2016-17) క్యూ4లో నమోదైన రూ. 140 కోట్లతో పోలిస్తే నష్టాలు భారీగా పెరిగాయి. మొత్తం ఆదాయం సైతం 33 శాతం క్షీణించి రూ. 378 కోట్లకు పరిమితమైంది.Most Popular