లాభాల్లో మార్కెట్లు- మెటల్‌ షేర్లు బోర్లా!

లాభాల్లో మార్కెట్లు- మెటల్‌ షేర్లు బోర్లా!

ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందినప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో వెనువెంటనే జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 142 పాయింట్లు ఎగసి 34,595కు చేరగా.. నిఫ్టీ 24 పాయింట్లు బలపడి 10,609 వద్ద ట్రేడవుతోంది. వెరసి సెన్సెక్స్‌ సాంకేతికంగా కీలకమైన 34,500ను అధిగమించగా.. నిఫ్టీ సైతం 10,600ను దాటింది.
ఐటీ వీక్‌
ఎన్‌ఎస్ఈలో ఎప్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌, ఆటో రంగాలు 0.5 శాతంపైగా పుంజుకోగా.. మెటల్‌ 2.6 శాతం పతనమైంది. ఐటీ సైతం 0.7 శాతం బలహీనపడింది. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్‌, ఆర్‌ఐఎల్‌, ఐసీఐసీఐ, లుపిన్‌, అదానీ పోర్ట్స్‌, జీ, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ 1.5-0.75 శాతం మధ్య పుంజుకున్నాయి. మెటల్‌ షేర్లలో నాల్కో, హిందాల్కో, వేదాంతా, హింద్‌ కాపర్‌, ఎన్‌ఎండీసీ, జిందాల్‌ స్టీల్‌, టాటా స్టీల్‌ 8-1.3 శాతం మధ్య పతనమయ్యాయి.  Most Popular