మరుగుతున్న ముడిచమురు!

మరుగుతున్న ముడిచమురు!

అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు మళ్లీ మండుతున్నాయి. ఒక్కరోజు చల్లబడ్డాక తిరిగి ఊపందుకున్నాయి. ప్రస్తుతం లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 0.5 శాతం పుంజుకుని 75 డాలర్లను అధిగమించింది. ఇక న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ బ్యారల్‌ సైతం 0.4 శాతం పెరిగి 69 డాలర్ల సమీపంలో కదులుతోంది. మధ్యప్రాచ్యంలో తిరిగి టెన్షన్లు నెలకొనడం చమురు ధరల పెరుగుదలకు కారణమైనట్లు నిపుణులు చెబుతున్నారు. యెమెన్‌ విప్లవకారులను లక్ష్యంగా చేసుకుని సౌదీ అరేబియా తాజాగా చేపట్టిన దాడులలో 45 మంది పౌరులు మరణించడంతో ఉద్రిక్తతలు నెలకొన్నట్లు తెలియజేశారు. మరోవైపు చమురు ధరలు పుంజుకుంటున్న నేపథ్యంలో ఒపెక్‌ దేశాల ఒప్పందానికి  కట్టుబడాల్సిన అవసరంలేదంటూ ఇరాన్‌ చమురు శాఖ మంత్రి బైజన్‌ పేర్కొనడం కూడా ధరలను బలపరచినట్లు నిపుణులు పేర్కొన్నారు.Most Popular