వెంటబడి మరీ ఈ షేర్లను ఎల్ఐసి ఎందుకు కొంటోందో తెలుసా

వెంటబడి మరీ ఈ షేర్లను ఎల్ఐసి ఎందుకు కొంటోందో తెలుసా

దేశంలోని అతిపెద్ద డీఐఐ అయిన ఎల్‌ఐసీ మార్చి క్వార్టర్‌లో పలు సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఈ ఏడాది బీఎస్‌ఈ 500 ఇండెక్స్‌లోని 35 పైగా కంపెనీల్లో ఏప్రిల్‌ 20 వరకు ఎల్‌ఐసీ పెట్టుబడులు పెట్టినట్టు కార్పొరేట్‌ డేటా బేస్‌ సంస్థ ఏస్‌ ఈక్విటీ.. డేటా ఆధారంగా తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ మార్కెట్‌ ద్వారా రికార్డు స్థాయిలో రూ.25వేల కోట్ల లాభాన్ని ఈ సంస్థ గడించింది. అంతకు ముందు ఏడాది(2016-17)లో లాభం రూ.19వేల కోట్లుగా ఉంది. 

ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తర్వాత దేశీయ సూచీలు భారీ ఒడిడుదుకులకు లోనయ్యాయి. లాంగ్‌టర్మ్‌ ఈక్విటీ గెయిన్స్‌పై పన్ను విధించడంతో మార్కెట్లు భారీ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. అలాగే యూఎస్‌-చైనా ట్రేడ్‌ వార్‌, ట్రంప్‌ నిర్ణయాలు, అంతర్జాతీయంగా రాజకీయ అనిశ్చితి, యూఎస్‌ ఫెడ్‌ వడ్డీరేట్లను పెంచడంతో మార్కెట్లు డీలా పడ్డాయి. ఎఫ్‌ఐఐలు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకోవడంతో దేశీయ సూచీలు మరింత నష్టపోకుండా డీఐఐలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టారు. రేటింగ్‌ ఏజెన్సీలు, ఐటీ, ఫార్మా, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, హౌజింగ్‌ ఫైనాన్స్‌, ప్రైవేట్‌ బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీ, పవర్‌ రంగాల్లోని కంపెనీల్లో తమ వాటాను పెంచుకున్నారు. ముఖ్యంగా జీవిత బీమ సంస్థ ఎల్‌ఐసీ కూడా ఇతర సంస్థలతో పోలిస్తే భారీగా పెట్టుబడులు పెట్టి పలు కంపెనీల్లో తమ వాటాలను పెంచుకుంది.

గత ఏడాది డిసెంబర్‌ 31 నాటికి కోల్‌ ఇండియాలో 9.66 శాతం వాటాను కలిగి ఉన్న ఎల్‌ఐసీ ఈ ఏడాది మార్చి 31 నాటికి తమ వాటాను 10.30 శాతానికి పెంచుకుంది. అలాగే ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ హెచ్‌పీసీఎల్‌ తమ వాటాను 2.08 శాతం నుంచి 2.17 శాతానికి, ఎల్‌అండ్‌టీలో 17.94 శాతం నుంచి 17.96 శాతానికి, టెక్‌ మహీంద్రాలో 3.60 శాతం నుంచి 3.77 శాతానికి, అల్ట్రా టెక్‌ సిమెంట్‌లో 2.33 శాతం నుంచి 2.41 శాతానికి, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో 3.84 శాతం నుంచి 4.89 శాతానికి తమ వాటాను పెంచుకుంది ఎల్‌ఐసీ. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు మూడేళ్ళ గరిష్టానికి పెరగడంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు భారీ అమ్మకాల ఒత్తిడిలో ఉన్నప్పుడు లోయర్‌ లెవల్స్‌లో ఐఎల్‌సీ పెట్టుబడులు పెట్టింది. అలాగే ఏఏ కంపెనీల్లో ఎల్‌ఐసీ ఇన్వెస్ట్‌ చేసిందో దిగువ పట్టికలో చూడండి. 


 Most Popular