బుల్స్‌కు వార్నింగ్ సిగ్నల్స్.. పెద్ద కరెక్షన్ రానుందా ???

బుల్స్‌కు వార్నింగ్ సిగ్నల్స్.. పెద్ద కరెక్షన్ రానుందా ???

కొద్ది రోజుల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు జాతీయ - అంతర్జాతీయ అంశాలపై ఆధారపడ్తూ.. ఎటు వెళ్లాలో తెలియక  అక్కడక్కడే కదలాడుతూ ఉన్నాయి. సిరియాపై అమెరికా దాడులు, రూపాయి పతనం, రాబోతున్న ఎలక్షన్లు.. వంటి ఏ అంశాన్ని మార్కెట్లు పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నో ప్రధాన వార్తలను జీర్ణించేసుకుని నిలకడగా, నిబ్బరంగా ఉంది. 

దీన్ని బట్టి చూస్తే మార్కెట్లు న్యారో ట్రేడింగ్ రేంజ్‌లోనే కదలాడేటట్టు ఉంది. ఒక బలమైన డైరెక్షన్ కోసం మార్కెట్లు ఎదురుచూస్తున్నాయి అనడంలో సందేహం లేదు. ఇలా ఎక్కువ కాలం పాటు నీరసంగా ఉండడం కూడా కరెక్షన్‌కు లైన్ క్లియర్ చేయొచ్చు. నీరసమైన రూపాయి కూడా ఇండెక్సులకు బ్రేక్ వేస్తోంది. దీనికి ఎఫ్ఐఐల అమ్మకాలు కూడా ఆజ్యం పోస్తున్నాయి. 

ప్రధాన ఐటి కంపెనీల ఫలితాలు కూడా ఫరవాలేదనిపించాయి. ఇన్ఫోసిస్ అంచనాలను అందుకున్నా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. టీసీఎస్, మైండ్ ట్రీ సంస్థలు అద్భుత ఫలితాలతో అదరగొట్టేశాయి. ఇలా ఉన్నంతలో పాజిటివ్ పాయింట్స్ కనిపిస్తున్నా.. ఇండెక్స్ మాత్రం పెద్దగా ఆవేశపడకుండా అక్కడే పడిఉన్నాయి. ఇది కూడా మరో నెగిటివ్ సంకేతం. 

వచ్చే వారం ఎలా

క్రూడ్ ఆయిల్ ధరలు మూడేళ్ల గరిష్టాన్ని చేరాయి. బ్యారెల్ 74 డాలర్లకు చేరింది. మరికొద్దికాలం పాటు 75-80 డాలర్ల మధ్యే కదలాడొచ్చు. రూపాయి పతనం, క్రూడ్ జోరు.. మార్కెట్లు పైకి వెళ్లకుండా నిరోధించవచ్చు. 

టెక్నికల్ ఔట్‌లుక్
ఇండెక్సులు నిరోధ స్థాయికి దాదాపుగా దగ్గరికి వచ్చాయి. గత మూడు నెలల కాలంలో మార్కెట్లు పెరిగి పడిన సంగతి మనకు తెలుసు. అక్కడి నుంచి మళ్లీ యాభై శాతం పెరిగి ఇప్పుడు స్థిరంగా నిలబడ్తున్నాయి. 50 పర్సెంట్ రీట్రేస్‌మెంట్ లెవెల్‌ తర్వాత మార్కెట్లు మళ్లీ కిందికి రావొచ్చు. 

అంచనాలు
మార్కెట్లు ఇప్పుడు పైకో.. కిందికో వెళ్లడానికి అంత ఆవేశంగా అయితేలేవు. ఎలాంటి నెగిటివ్ న్యూస్ వచ్చినా దాన్ని పరిణితితో అర్థం చేసుకుని రియాక్ట్ అవుతున్నాయి. ఒకప్పటి మాదిరి ప్యానిక్ అయిపోవట్లేదు. అందుకే మంచి స్టాక్స్‌ను బార్గైనింగ్ ప్రైస్‌లో తీసుకోవాలని చూస్తున్నారు. సెక్టోరియల్ ట్రెండ్స్‌ ఆధారంగా ట్రేడింగ్‌కు ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి. కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత మార్కెట్లు బాగా పెరగడమో, తగ్గడమో తప్పక ఉంటుంది. అయితే అలాంటి ఆపర్చునిటీ ఎప్పుడెప్పుడూ వస్తుందా అని వేచిచూసేవాళ్లకు సరైన సమయం అది. 

ఒక వేళ నా అంచనా కరెక్ట్ అయి మార్కెట్లు ఇక్కడి నుంచి బాగా పతనమైతే.. మంచి స్టాక్స్‌ను మాత్రమే గుడ్ క్వాంటిటీలో పిక్ చేసుకోండి. అదే నా సలహా. 

రచయిత - జిమీత్ మోడీ, సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ
 Most Popular