ఐపీవో బాటలో పీఎన్‌బీ మెట్‌లైఫ్‌!

ఐపీవో బాటలో పీఎన్‌బీ మెట్‌లైఫ్‌!

మాతృ సంస్థ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వెనకడుగు వేసిన బీమా అనుబంధ సంస్థ పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ ఎట్టకేలకు పబ్లిక్‌ ఇష్యూ సన్నాహాలు మొదలుపెట్టింది. వజ్రాల వ్యాపారీ నీరవ్‌ మోడీ ఎల్‌వోయూ కుంభకోణం కారణంగా ఐపీవో యోచన ఆలస్యమైనప్పటికీ ఆగస్ట్‌కల్లా పబ్లిక్‌ ఇష్యూ చేపట్టాలని పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌ భావిస్తోంది. ఇందుకు వీలుగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద త్వరలో ప్రాస్పెక్టస్‌ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.
రూ. 2,000 కోట్ల ఇష్యూ
షేర్ల విక్రయం ద్వారా పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ ప్రమోటర్లు రూ. 2,000 కోట్లను సమీకరించాలని భావిస్తున్నారు. తద్వారా కంపెనీ విలువను రూ. 8,000 కోట్లుగా అంచనా వేశారు. 2018 ఆగస్ట్‌లోగా పబ్లిక్‌ ఇష్యూ చేపట్టే సన్నాహాల్లో ప్రమోటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన నాలుగో బీమా కంపెనీగా పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ నిలిచే అవకాశముంది. ఇప్పటికే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, ఎస్‌బీఐ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఐపీవోల ద్వారా మార్కెట్ల నుంచి నిధులు సమీకరించిన విషయం విదితమే.Most Popular