కుటుంబరావు మార్కెట్ వ్యూ, రికమెండేషన్స్

కుటుంబరావు మార్కెట్ వ్యూ, రికమెండేషన్స్

వరుసగా నాల్గోవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఐటీ, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ సూచీలు ఈవారం మార్కెట్లను లీడ్‌ చేశాయి. క్రూడాయిల్‌ ధరలు మూడేళ్ళ గరిష్ట స్థాయికి చేరడంతో మార్కెట్లు ఒత్తిడికి లోనైనప్పటికీ.. వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 223 పాయింట్లు, నిఫ్టీ 83 పాయింట్లు లాభపడ్డాయి. గత వారం ఆర్థిక ఫలితాలను విడుదల చేసిన కంపెనీల్లో అధికభాగం సంస్థలు.. అంచనాలను మించాయి. 100 బిలియన్‌ డాలర్ల కంపెనీల జాబితాలో చేరబోయే తొలి సంస్థగా టీసీఎస్‌ అవతరించనుంది.

ఇక వచ్చే వారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతి ఎయిర్‌టెల్‌, విప్రో, యస్‌ బ్యాంక్‌, మారుతి, బయోకాన్‌ తదితర కంపెనీల నాల్గో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు విడుదల కానున్నాయి. గత మూడు నెలలుగా అల్యూమినియం, నికెల్‌ ధరలు వరుసగా 14 శాతం, 19శాతం పెరిగాయి. 

వచ్చే వారానికి ఇండెక్స్‌ లెవెల్స్‌ :
సెన్సెక్స్‌ సపోర్ట్‌ : 34,150 / 33,800
సెన్సెక్స్‌ రెసిస్టెన్స్‌ : 34,750 / 35,100

నిఫ్టీ సపోర్ట్‌ : 10,475 / 10,385
నిఫ్టీ రెసిస్టెన్స్‌ : 10,650 / 10,775

వచ్చే వారానికి సంబంధించి ఎఫ్‌&ఓ సెగ్మెంట్లో  హిందుస్తాన్‌ జింక్‌, టాటా గ్లోబల్‌, మదర్సన్‌ సుమి, వొకార్డ్‌, ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌లను కొనుగోలు చేయొచ్చు. 

అలాగే పీసీ జ్యువెలర్స్‌, హెచ్‌పీసీఎల్‌, టైటాన్‌ ఇండస్ట్రీస్‌, ఐడియా, బీపీసీఎల్‌ స్టాక్స్ సెల్లింగ్‌కు అనుకూలంగా ఉన్నాయ.

ఈ వారం ప్రత్యేకంగా చెప్పాల్సిన ప్రస్తావించుకోవాల్సిన స్టాక్ ఫినిక్స్‌ మిల్స్‌. ఈ స్టాక్‌ జనవరి 2000 నుంచి ఏప్రిల్‌ 2018 మధ్య కాలంలో 32000% పెరిగింది. మిల్‌ టు మాల్ అనే స్థాయికి ఓ కంపెనీ ఎదగడం ప్రశంసించాల్సిన అంశం. 

స్టాక్ రికమెండేషన్స్ :


లెమన్‌ ట్రీ హోటల్స్‌ : 2002లో ఢిల్లీ కేంద్రంగా ప్రారంభమైన లెమన్ ట్రీ హోటల్స్‌కి.. ప్రస్తుతం 28 పట్టణాల్లో 45 హోటళ్ళు ఉన్నాయి. లగ్జరీ అండ్ అఫోర్డబుల్ సెగ్మెంట్లలో మొత్తం నాలుగు రకాల స్థాయిలలో దాదాపు 5వేల రూమ్స్‌ను(FY2018 నాటికి) కంపెనీ నిర్వహిస్తోంది. ప్రస్తుతం రెడ్ ఫాక్స్, లెమన్ ట్రీ, లెమన్ ట్రీ ప్రీమియర్ పేరుతో 3 బాండ్లు ఉన్నాయి. NCR, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైతో పాటు టైర్-1, టైర్-2 పట్టణాలైన పూణే, అహ్మదాబాద్, ఛండీఘడ్, జైపూర్, ఇండోర్, ఔరంగాబాద్ తదితర నగరాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తోంది.  తక్కువ బడ్జెట్‌తో మిడ్ మార్కెట్ హోటల్స్‌లో అగ్రగామి సంస్థల్లో ఒకటైన లెమన్ ట్రీ హోటల్స్‌లో.. ప్రస్తుతం 5వేల మందికి పైగా ఉపాధిని పొందుతున్నారు. లెమన్ ట్రీ ప్రీమియర్ అప్పర్ మిడిల్ క్లాస్ వర్గాలకు, లెమన్ ట్రీ హోటల్స్ మధ్యతరగతి ప్రజల కోసం కాగా, ఎకానమీ సెగ్మెంట్లో రెడ్ ఫాక్స్ సేవలు అందిస్తోంది. భారత దేశంలో వేగంగా విస్తరిస్తూ, అతిథుల మన్ననలు అందుకుంటోంది ఈ సంస్థ. ప్రస్తుతం రూ.83 వద్ద కదలాడుతోన్న ఈ స్టాక్‌ను ఏడాది పాటు హోల్డ్‌ చేస్తే మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. ఈ స్టాక్‌ టార్గెట్‌ ప్రైస్‌ రూ.150.

డేటామెటిక్స్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ : ఐటీ, బీపీవో, కన్సల్టింగ్‌ సర్వీసులను అందించే సంస్థ డేటామెటిక్స్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌. ఫైనాన్స్‌, అకౌంటింగ్‌, ఐటీ, మొబిలిటీ, ఇంజనీరింగ్‌ తదితర రంగాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తోంది. ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా కనిపిస్తోన్న ఈ స్టాక్‌ను వచ్చే ఏడాది కాలం కోసం హోల్డ్‌ చేసుకొంటే మంచిది. ఈ స్టాక్‌ను తగ్గినప్పుడల్లా కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయం. ప్రస్తుతం రూ. 131 వద్ద కదలాడుతోన్న ఈ స్టాక్‌ టార్గెట్‌ ధర రూ.200

కాయా లిమిటెడ్‌ : భారత్‌‌తో పాటు విదేశాలలో హెల్త్‌కేర్‌, బ్యూటీ, పర్సనల్‌కేర్‌ ప్రోడక్ట్‌లను అందిస్తోంది కాయా లిమిటెడ్‌. వివిధ పద్ధతుల ద్వారా ఈ సంస్థ మెడికల్‌ సర్వీసులను కూడా అందిస్తోంది. సర్జికల్‌ లేజర్స్‌, చర్మ పరిరక్షణ ఉత్పత్తులతో పాటు కాయా స్కిన్‌ క్లినిక్స్‌, థర్డ్‌ పార్టీ స్టోర్ట్స్‌, స్కిన్‌ బార్స్‌ను ఈ సంస్థ నిర్వహిస్తోంది. మిడిల్‌ ఈస్ట్‌లోనూ కాయా స్కిన్‌ క్లినిక్‌ను ఈ సంస్థ విజయవంతంగా నడుపుతోంది. ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న ఈ కంపెనీ షేర్లను తగ్గినప్పుడల్లా కొనుగోలు చేయండి. ప్రస్తుతం రూ.1200 ఎగువన ఉన్న ఈ స్టాక్‌ను ఏడాది కాల వ్యవధి కోసం హోల్డ్‌ చేయవచ్చు. ఈ స్టాక్‌ టార్గెట్‌ ధర రూ.2000.

- C Kutumba Rao, Investment AdvisorMost Popular