సెల్ఫీ స్పెషల్ .. ఒప్పో ఎఫ్7

సెల్ఫీ స్పెషల్ .. ఒప్పో ఎఫ్7

ఒకప్పుడు సెల్‌ఫోన్ అంటే కాల్స్ మాట్లాడుకునేందుకు మాత్రమే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. స్మార్ట్‌ఫోన్‌లు విపరీతంగా హల్‌చల్ చేస్తున్నాయి. మొబైల్ ఫోన్స్‌లో ఇప్పుడు కెమేరా అత్యంత ముఖ్యమైన ఫీచర్‌గా మారిపోయింది. గత కొంతకాలంగా సెల్ఫీ కల్చర్ పెరిగిపోయిన తర్వాత ఫ్రంట్ కెమేరాకు ప్రాధాన్యత ఇచ్చి ఫోన్లకు రూపకల్పన చేయడం కనిపిస్తోంది. సెల్ఫీ పైనే ఫోకస్ చేసి మరీ.. కొన్ని కంపెనీలు తమ స్మార్ట్ ఫోన్లను మార్కెట్ చేసుకుంటున్నాయి.

చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో.. సెల్ఫీ ప్రధాన థీమ్‌గా స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తుంటుంది. సెల్ఫీ ఎక్స్‌పర్ట్ అంటూ ట్యాగ్ లైన్‌లో మార్కెటింగ్ వ్యూహాలను అనుసరిస్తున్న ఈ కంపెనీ.. ఇప్పుడు ఒప్పో ఎఫ్5 అంటూ కొత్త మోడల్‌ను ఇండియాలో లాంఛ్ చేసింది. పెద్ద స్క్రీన్.. హై రిజొల్యూషన్ కెమేరాలు ఈ మోడల్ ప్రత్యేకత. ముందు వైపు 25 మెగా పిక్సెల్ కెమేరాతో పాటు.. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కూడా జోడించడం విశేషం.

 

ఫీచర్స్ ఏంటి? 

ఫీచర్స్ పరంగా ఒప్పో ఎఫ్7 మోడల్‌కు అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. ముఖ్యంగా హైఎండ్ వెర్షన్‌కు 6జీబీ ర్యామ్.. 128జీబీ ఇంటర్నల్ మెమరీ ఉండడం హైలైట్ అని చెప్పవచ్చు. డ్యుయల్ సిమ్ సపోర్ట్‌తో పాటు.. ఎక్స్‌టర్నల్ మెమరీ కోసం డెడికేటెడ్ స్లాట్ ఉంది. ఇది 256జీబీ వరకు మైక్రో SD కార్డును సపోర్ట్ చేస్తుంది

6.22 అంగుళా ఫుల్ హెచ్‌డీ ప్లస్ స్క్రీన్.. ఒప్పో ఎఫ్‌7 ఆకర్షణలలో మరొకటి. గ్లాస్-మెటల్-గ్లాస్‌ శాండ్‌విచ్ డిజైన్‌తో ఈ స్క్రీన్‌ను రూపొందించారు. 6.2 అంగుళాల స్క్రీన్ అంటే పెద్దగా అనిపించవ్చచు కానీ.. 16:9 రేషియో డిస్‌ప్లే గల ఈ ఫోన్.. ఫుల్‌స్క్రీన్ గ్లాస్ కావడంతో.. సాధారణంగా 5.5 అంగుళాల ఫోన్ మాదిరిగానే ఉంటుంది.

 

యూజర్ ఇంటర్‌ఫేస్ 

అయితే యూజర్ ఇంటర్‌ఫేస్ పరంగా మాత్రం పెద్దగా ప్రయోగాల జోలికి పోలేదు. నోటిఫికేషన్ ఏరియా కూడా సాధారణంగానే ఉంటుంది. కానీ గెస్చర్ కంట్రోల్స్ ద్వారా స్క్రీన్ ఆపివేసి ఉంచిన సమయంలో కూడా నియంత్రించగలిగే సదుపాయం ఉండడం.. పలు యాప్స్‌ను షార్ట్‌కట్స్ ద్వారానే ఓపెన్ చేయగలగడం సౌకర్యంగా చెప్పవచ్చు.

గ్లాస్‌కు మెటల్‌ను కూడా మిక్స్ చేయడంతో.. టచ్ రెస్పాన్స్ విషయంలో కొన్నిసార్లు ఇబ్బంది అనిపించే అవకాశం ఉంది. సాధారణ రెస్పాన్స్ కంటే కొన్ని మైక్రో సెకన్ల ఆలస్యంగా ఈ స్క్రీన్ స్పందిస్తోందని టెక్నాలజీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. పెద్ద సైజులో ఉండే వెబ్ పేజ్‌లు.. యూట్యూబ్ వీడియో ప్లేలిస్ట్‌ల వంటి వాటిని యాక్సెస్ చేసే సమయంలో ఈ ఇబ్బంది అర్ధం అవుతుంది. 

 

అద్భుతమైన ఫోటోస్ 
ఇక ఇమేజింగ్ విషయానికి వస్తే ఒప్పో ఎఫ్7కు 16 మెగాపిక్సెల్ రేర్ కెమేరా.. 25 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా ఉన్నాయి. ఫేస్ అన్‌లాకింగ్ కోసం ఫ్రంట్ కెమేరా విషయంలో కొన్ని అధునాతన సాఫ్ట్‌వేర్‌లను డోజించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడ్ ద్వారా ఫోటోలను మరింత నాణ్యంగా తీసుకోవచ్చు. ముందు.. వెనుక.. కెమేరాలు రెండూ మంచి ఔట్‌పుట్‌ను అందిస్తాయి. 

ఏఐ ఆధారిత ఫోటోల విషయంలో ఎక్కువ దూరం నుంచి తీసిన ఫోటోలు కృత్రిమంగా అనిపించే అవకాశం ఉంది. బ్యూటిఫికేషన్.. ఫిల్టర్స్ కారణంగా.. మిలీనియల్స్.. సోషల్ మీడియా ఔత్సాహికులకు ఒప్పో ఎఫ్7 కంప్లీట్ ప్యాకేజ్‌లా ఉంటుంది. కానీ సీరియస్ ఫోటోగ్రాఫర్లకు మాత్రం సహజత్వం కోల్పోయిన ఫోటోలు అంతగా నచ్చకపోవచ్చు.

 

రేటెంత?

4 జీబీ ర్యామ్.. 64 జీబీ ఇంటర్నల్ మెమరీ గల బేసిక్ వెర్షన్ ధర.. మార్కెట్లో 22వేల రూపాయలుగా ఉండగా.. 6జీబీ ర్యామ్.. 128 జీబీ ఇంటర్నల్ మెమరీ గల ప్రీమియం వెర్షన్ ధర రూ. 27వేలుగా ఉంది. సెల్ఫీ ప్రియులను మాత్రం ఒప్పో ఎఫ్7 విపరీతంగా నచ్చేయడం ఖాయం.Most Popular