కొత్త యూనిట్‌తో భారత్‌ బిజిలీ వెలుగు

కొత్త యూనిట్‌తో భారత్‌ బిజిలీ వెలుగు

మ్యాగ్నెట్‌ టెక్నాలజీ మెషీన్లకుగాను ఆధునిక యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించడంతో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ సంస్థ భారత్‌ బిజిలీ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు దృష్టి పెట్టడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2 శాతం పెరిగి రూ. 1635 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1646 వరకూ ఎగసింది. రూ. 8 కోట్లతో నవీముంబైలోని ఎయిరోలీ యూనిట్లో కొత్త సౌకర్యాలను సమకూర్చినట్లు తెలియజేసింది. దీంతో ఉత్పత్తి పుంజుకోవడంతోపాటు.. సర్వీసుల సామర్థ్యం పెరగనున్నట్లు వివరించింది.Most Popular