పీఎస్‌యూ బ్యాంక్స్‌ బోర్లా- ఐటీ జూమ్‌!

పీఎస్‌యూ బ్యాంక్స్‌ బోర్లా- ఐటీ జూమ్‌!

అటు అమెరికా.. ఇటు ఆసియా మార్కెట్లలో అమ్మకాలదే పైచేయికావడంతో దేశీయంగానూ సెంటిమెంటు బలహీనపడింది. దీంతో తొలి నుంచీ మార్కెట్లు నష్టాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 75 పాయింట్ల వెనకడుగుతో 34,352కు చేరగా.. నిఫ్టీ 33 పాయింట్లు క్షీణించి 10,532 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్ఈలో అన్ని రంగాలూ నష్టపోగా.. ఐటీ 3.5 శాతం జంప్‌చేసింది.
పీఎస్‌యూ బ్యాంక్స్‌ పతనం
ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌ ఇండెక్స్‌ 2.5 శాతం పతనంకాగా.. మెటల్‌, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ 2-0.8 శాతం మధ్య బోర్లా పడ్డాయి. ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో ఐటీ షేర్లు హవా చూపితే.. ప్రభుత్వ బ్యాంకులు డీలాపడ్డాయి.
ఇదీ తీరు
డెరివేటివ్‌ విభాగంలో టీసీఎస్‌ 6 శాతం దూసుకెళ్లగా.. నిట్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, మైండ్‌ ట్రీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, కేపీఐటీ, టెక్‌ మహీంద్రా, హెక్సావేర్‌, ఒరాకిల్‌, విప్రో 4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే మరోపక్క బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, నాల్కో, ఐడీబీఐ, కెనరా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, ఆంధ్రా బ్యాంక్‌, ఓబీసీ, జిందాల్‌ స్టీల్‌, ఇండియన్‌ బ్యాంక్‌, జేపీ 6.5-4 శాతం మధ్య పతనమయ్యాయి.Most Popular