విద్యార్థులకు డాక్టర్ రెడ్డీస్ స్కాలర్‌షిప్స్ 

విద్యార్థులకు డాక్టర్ రెడ్డీస్ స్కాలర్‌షిప్స్ 

టెన్త్ లో మంచి ప్రతిభ కనబరచి తరువాత ఆర్థిక ఇబ్బందులతో విద్యను కొనసాగించలేని  విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే సదుద్దేశ్యంతో ప్రముఖ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్  స్కాలర్‌షిప్‌‍లు అందజేసింది. తెలంగాణలోని 22 జిల్లా పరిషత్ హైస్కూల్స్ కు చెందిన 250  మంది స్టూడెంట్స్‌కు ఈ స్కాలర్‌షిప్స్ అందించారు.  2015-16లో పదో తరగతిలో మెరుగైన  గ్రేడ్‌లతో పూర్తి చేసిన విద్యార్థినీ, విద్యార్థులకు మొత్తం 25 లక్షల రూపాయలు మేర ఉపకార  వేతనాలు అందించారు. మదినాగూడలోని కల్లెం అంజిరెడ్డి విద్యాలయలో ఈ స్కాలర్‌షిప్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అనురాధ ప్రసాద్  హాజరైయ్యారు. ఆర్థిక పరంగా సరైన ప్రోత్సాహం లేకపోవడంతో తెలివైన విద్యార్థులు సైతం  ఉన్నతవిద్యను కొనసాగించలేకపోతున్నారని..అలాంటి వారికోసం డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్  అండగా నిలుస్తోందని స్కూల్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్ హెడ్ మోహన్ కృష్ణ తెలిపారు.Most Popular