బ్యాంకింగ్ సమస్యలపై అంబుడ్స్ మెన్ కు ఫిర్యాదు చెయ్యండి

బ్యాంకింగ్ సమస్యలపై అంబుడ్స్ మెన్ కు ఫిర్యాదు చెయ్యండి

బ్యాంకింగ్ అంబుడ్స్ మెన్ కు 2015-16 ఆర్థిక సంవత్సరంలో  5901  ఫిర్యాదులు అందినట్టు తెలంగాణ, ఏపీ బ్యాంకింగ్ అంబుడ్స్ మెన్ కృష్ణమోహన్ వెల్లడించారు. అంతకు ముందేడాదితో పోలిస్తే కంప్లైయింట్స్ 35 శాతం మేర పెరిగాయని ఆయన అన్నారు. వీటిల్లో 25 శాతానికి పైగా  ఎటియం డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయని, ప్రభుత్వ రంగ బ్యాంకులైన ఎస్ బిఐ దాని అసోసియేట్ బ్యాంకులపై 36 శాతం కంప్లైంట్స్ వచ్చాయని  ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఢిల్లీ నుంచి అత్యధిక ఫిర్యాదులందుతున్నాయని అలాగే  బ్యాంకుల నుంచి ఇబ్బందులు వస్తే కస్టమర్లు బ్యాంకింగ్ అంబుడ్స్ మెన్ కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఆర్బీఐ నుంచి కస్టమర్లకు ఫోన్ కాల్స్ రావని, ఎటియం కార్డు పిన్ నెంబర్ చెప్పి ఎవరూ మోసపోవద్దని కృష్ణమోహన్ చెప్పారు.Most Popular