రెండేళ్లలో వెయ్యి శాతం రాబడి.. కొన్ని స్టాక్స్‌ను తక్కువ అంచనా వేయద్దు!

రెండేళ్లలో వెయ్యి శాతం రాబడి.. కొన్ని స్టాక్స్‌ను తక్కువ అంచనా వేయద్దు!

ఆయా స్టాక్స్‌ను కేవలం అవి నిర్వహించే వ్యాపారం అనుసరించి మాత్రమే అంచనాలు వేసుకుని.. వాటికి దూరంగా ఉంటే ఎంతగా లాభాలను కోల్పోయే అవకాశం 
స్మాల్‌క్యాప్ పెట్రోకెమికల్స్ రంగంలోని తొలితరం స్టాక్.. నికర లాభం రెట్టింపు చేసుకోవడం ప్రారంభించింది. అలాగే మదుపర్ల సంపదను కూడా పలు రెట్లు చేస్తోంది. నికర లాభంలో 100 శాతంకు మించి వృద్ధిని ప్రకటించడం.. భన్సాలి ఇంజినీరింగ్‌కు ఇది వరుసగా నాలుగో సంవత్సరం కావడం గమనించాల్సిన విషయం.
దలాల్ స్ట్రీట్‌లో ఈ కంపెనీ స్టాక్ అద్భుతాలు సృష్టిస్తోంది. గత రెండేళ్ల కాల వ్యవధిలోనే ఈ స్టాక్ 10 రెట్లకు పైగా దూసుకుపోయింది. 2016 ఏప్రిల్ 11 నాడు ఈ స్టాక్ ధర రూ. 18.80 ఉండగా.. 2018 ఏప్రిల్ 19నాడు రూ. 209 దగ్గరకు భన్సాలి ఇంజినీరింగ్ చేుకుంది. అంటే దాదాపు 11 రెట్లకు షేర్ ధర పెరిగిందన్న మాట. ఈ కంపెనీలో ఇంకా స్ట్రెంగ్త్ ఉందని ఎనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు. 
ఏబీఎస్(అక్రిలోనిట్రైల్ బుటాడైన్ స్టైరెన్) తయారీ విభాగంలో భన్సాలి ఇంజినీరింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆటో మొబైల్, హోమ్ అప్లయెన్సెస్, టెలి కమ్యూనికేషన్స్, లగేజ్‌తో పాటు ఇతర రంగాలకు ముడి సరుకును అందిస్తోంది.

కనీసం రెట్టింపు లాభాలు
2018 మార్చ్ 31 త్రైమాసికంలో ఈ కంపెనీ రూ. 99.64 కోట్ల నికర లాభం ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ. 35.63 కోట్లతో పోల్చితే ఇది 179 శాతం ఎక్కువ. అలాగే 2016, 2015, 2014 సంవత్సరాలలో కంపెనీ నికర లాభాలు వరుసగా రూ. 16.69 కోట్లు, రూ. 5.40 కోట్లు, రూ. 1.48 కోట్లుగా ఉన్నాయి. అంటే ప్రతీ ఏటా కంపెనీ లాభాలు కనీసం రెట్టింపునకు పైగా పెరుగుతున్నాయన్నమాట.

బడా క్లయింట్స్
హెచ్ఎంఎస్ఐ, మారుతి, వర్ల్‌పూల్, శాంసంగ్, ఎల్‌జీ, టొయోటా, మహీంద్రా, బజాజ్, గోద్రెజ్, హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్ వంటి కంపెనీలు బీఈపీఎల్‌కు క్లయింట్స‌ఘా ఉన్నాయి.

రుణాల్లేవు
ఈ కంపెనీ పూర్తిగా రుణ రహితం. వర్కింగ్ క్యాపిటల్ రూపంలో అలహాబాద్ బ్యాంక్ నుంచి తీసుకున్న మొత్తం రూ. 216.5 కోట్లను పూర్తిగా చెల్లించివేసినట్లు మార్చ్ 31తో ముగిసిన కాలానికి కంపెనీ వెల్డించింది. 
బ్యాంక్ నుంచి బకాయిలు లేవనే ధృవపత్రం అందుకోవడంతో పాటు.. కొలెటరల్ సెక్యూరిటీ రూపంలో బ్యాంక్ వద్ద ఉన్ 5 కోట్ల ఈక్విటీ షేర్లను, ల్యాండ్, బిల్డింగ్‌లను, ప్లాంట్- మెషినరీలను.. అలాగే అబు రోడ్ ప్లాంట్ అండ్ సట్నూర్ ప్లాంట్‌లకు చెందిన ఇతర స్థిర ఆస్తులను రిలీజ్ చేసినట్లు భన్సాలి వర్గాలు తెలిపాయి.

పెరిగిన వాటా
మార్చ్‌తో ముగిసిన త్రైమాసికానికి కంపెనీ ప్రమోటార్ల వాటా స్వల్పంగా పెరిగి 55 శాతానికి చేరుకుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో 54.25 శాతం.. డిసెంబర్ నాటికి 54.69 శాతంగా ప్రమోటర్ల వాటా ఉండేది. Most Popular