కన్సాలిడేషన్ మార్కెట్లోనూ ఈ స్టాక్స్ పైపైకి దూకుతున్నాయ్ !

కన్సాలిడేషన్ మార్కెట్లోనూ ఈ స్టాక్స్ పైపైకి దూకుతున్నాయ్ !

స్టాక్ మార్కెట్లు గత మూడు వారాలుగా కన్సాలిడేషన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. పెద్దగా రేంజ్ లేకపోయినప్పటికీ పాజిటివ్‌గానే ఉన్నాయి. 10,000 పాయింట్ల నుంచి 10500 పాయింట్ల మధ్య స్థిరంగా కదలాడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తే.. 10400 పాయింట్ల దగ్గర నిఫ్టీకి పటిష్ట రేంజ్ ఏర్పడినట్టు ఉంది. ఒక వేళ ఇది బ్రేక్ అయితే మళ్లీ నీరసం మొదలుకావొచ్చు. లేకపోతే అప్పటివరకూ 10600-10700 సమీప టార్గెట్లుగా ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఇక ఈ రోజు 52 వారాల గరిష్ట స్థాయిని (52వీక్ హై) టచ్ చేసిన స్టాక్స్ జాబితా ఓ సారి చూడండి. నేడు ఈ స్థాయికి చేరిన స్టాక్స్ 46 ఉన్నాయి. 52 వారాల కనిష్ట స్థాయికి చేరిన స్టాక్స్ లిస్ట్‌లో 30 స్టాక్స్ ఉన్నాయి. 

స్టాక్                            52వీక్ హై
ఆర్తి ఇండస్ట్రీస్           రూ.1276
అబాట్                       రూ.6690
అపోలో టైర్స్             రూ.301.50
అశోక్ లేల్యాండ్         రూ.152.50
బాల్‌క్రిష్ణ ఇండస్ట్రీస్   రూ.1328
దివీస్ ల్యాబ్స్             రూ.1177
ఎస్కార్ట్స్                     రూ.976
జిఎన్ఏ యాక్సిల్స్      రూ.573
ఐబి వెంచర్స్              రూ.380.80
ఇండస్ ఇండ్             రూ.1872
మైండ్ ట్రీ                   రూ.872
పిడిలైట్                     రూ.1046
టెక్ మహీంద్రా           రూ.682.80


 Most Popular