స్మాల్‌క్యాప్ కూడా రికవరీ

స్మాల్‌క్యాప్ కూడా రికవరీ

కన్జూమర్ డ్యూరబుల్స్, ఐటీ, టెక్నాలజీ, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ రంగాలు నెగిటివ్‌గా ముగియగా.. బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, హెల్త్‌కేర్, మెటల్స్, రంగాల్లోని షేర్లు మార్కెట్లను లాభాల బాటలో నడిపించాయి.

ఇవాల్టి ట్రేడింగ్‌లో స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ షేర్లు కూడా మంచి లాభాలను గడించడం సానుకూలంగా చెప్పుకోవాలి. అరశాతం పైగా స్మాల్‌క్యాప్ సూచీ పెరగగా.. 0.3 శాతం మేర మిడ్‌క్యాప్ ఇండెక్స్ లాభపడింది.

నిఫ్టీలో సిప్లా 5.4 శాతం, గ్రాసిం 2.6 శాతం, హీరో మోటోకార్ప్ 2.18 శాతం, యూపీఎల్ 2.16 శాతం, ఎన్‌టీపీసీ 2.02 లాభపడి షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలవగా.. టాటా మోటార్స్ 4.78 శాతం, ఇన్ఫోసిస్ 3.07 శాతం, విప్రో 1.39 శాతం, ఐడియా సెల్యులార్ 1.25 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.74 చొప్పున నష్టపోయి నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. 
 Most Popular