లాభాల క్లోజింగ్: స్ట్రాంగ్ ట్రెండ్

లాభాల క్లోజింగ్: స్ట్రాంగ్ ట్రెండ్

స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల ఎఫెక్ట్.. ఇన్ఫోసిస్ ఫలితాల ప్రభావంతో ఉదయం నష్టాలతో మొదలైన సూచీలు.. క్రమంగా కోలుకున్నాయి. మిడ్ సెషన్ సమయానికి లోయర్ లెవెల్స్‌లో కొనుగోళ్లు ఊపందుకోవడంతో.. మార్కెట్లు లాభాల్లోకి చేరుకున్నాయి.

ఐరోపా మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమైనా మన మార్కెట్లలో మాత్రం బయింగ్ జోరుగా సాగింది. ఉదయం నష్టాల్లో ఉన్న ఐటీ, టెక్నాలజీ కౌంటర్లు లాభాల బాట పట్టడం.. వీటికి బ్యాంకింగ్ షేర్లు జత కలవడంతో మార్కెట్లు లాభాలు గడించాయి.

ఇవాల్టి ట్రేడింగ్‌లో 0.33 శాతం లాభపడిన సెన్సెక్స్ 112.78 పాయింట్ల లాభంతో 34305.43 వద్ద ముగిసింది. 0.46 శాతం పెరిగిన 47.75 పాయింట్లు లాభపడిన నిఫ్టీ ఇండెక్స్ 10528.35 వద్ద ముగిసింది. 120.25  పాయింట్లు లాభపడిన బ్యాంక్ నిఫ్టీ 25320.85 వద్ద క్లోజయింది.
 Most Popular