మ్యూచువల్ ఫండ్స్ మెచ్చిన స్టాక్స్ ఇవి

మ్యూచువల్ ఫండ్స్ మెచ్చిన స్టాక్స్ ఇవి

దీర్ఘకాలిక మూలధన ఆదాయపు పన్నుతో వాటిల్లిన నష్టాలను సరిచూసుకున్న తర్వాత మ్యూచువల్ ఫండ్ మేనేజర్లుకొన్ని ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టేందుకు సిధ్దమయ్యారు. రానున్న కొన్ని సంవత్సరాలను ప్రాతిపదికగా తీసుకుని మంచి లాబాలు పంచవచ్చనే అంచనాతో కొన్ని కంపెనీలను ఎంచుకున్నారు. అలా ఫండ్ మేనేజర్లనుంచి నిధులు రాబట్టిన స్టాక్స్‌ కొన్నిటిని చూద్దాం
ఏఐఏ ఇంజనీరింగ్
పెట్టుబడి పెట్టిన ఫండ్ : DSP బ్లాక్ రాక్ మ్యూచువల్ ఫండ్
సిఎంపి: రూ.1417
మార్కెట్ కేపిటలైజేషన్: రూ.13366కోట్లు

ఏఐఏ ఇంజనీరింగ్ సంస్థ సిమెంట్, మైనింగ్ ప్లాంట్లతో పాటు థర్మల్  పవర్ స్టేషన్లలో మెటీరియల్ క్రష్ చేయడానికి, గ్రైండింగ్ చేయడానికి అవసరమైన పరికరాలను తయారు చేస్తుంది. మైనింగ్, సిమెంట్ ఇండస్ట్రీల్లో డిమాండ్ పెరుగుతుందనే అంచనా ఉంది. ఈ రెండు రంగాల్లో డిమాండ్ 25లక్షల టన్నుల మేరకు పెరగవచ్చని అంచనా..అందులో 15లక్షల టన్నుల నుంచి 20లక్షల టన్నుల సరుకు వరకూ మైనింగ్ రంగంనుంచే ఉంటుందని ఈ రంగాన్ని పరిశీలిస్తున్నవారు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఏఐఏ ఇంజనీరింగ్ విషయానికి వస్తే సామర్ధ్యంలో 65శాతం మాత్రమే వినియోగం అవుతోంది. 2020నాటికి ఏఐఏ హై క్రోమియం భాగాల ఉత్పత్తి సామర్ధ్యాన్ని 4,40,000 టన్నులకు చేర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ సామర్ధ్యం ఇప్పుడు 3,40,000 టన్నులు మాత్రమే ఉంది. మైనింగ్ రంగంలోనుంచి వస్తోన్న ఆర్డర్లను అందిపుచ్చుకోవడం ఏఐఏ ఇంజనీరింగ్ ముందు ఉంటుందని అంచనా

ఫినోలెక్స్ ఇండస్ట్రీస్
పెట్టుబడి పెట్టిన ఫండ్: ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ మ్యూచువల్ ఫండ్
సిఎంపి: రూ.658
మార్కెట్ కేపిటలైజేషన్: రూ.8175కోట్లు

దేశంలోనే అతిపెద్ద పివిసి పైపులు తయారు చేసే ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ 2020నాటికి ఉత్పత్తి సామర్ధ్యం పెంచే వ్యూహాల్లో ఉంది. తయారు చేసిన మొత్తం పైపుల్లో 70శాతం వ్యవసాయరంగంలో విక్రయిస్తుండగా, మిగిలిన ఉత్పత్తులు ఇతర రంగాల్లో అమ్ముతోంది. ఫినోలెక్స్‌కి దేశవ్యాప్తంగా 800 డీలర్లు, 18వేల రిటైలర్లతో బలమైన నెట్‌వర్క్ కలిగి ఉంది. కంపెనీకి కస్టమర్లుగా వ్యవసాయ, గృహ, టెలికమ్యూనికేషన్స్, నిర్మాణరంగంలోని కంపెనీలు ఉన్నాయి. ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన్, అందరికీ ఇళ్లు వంటి పథకాలతో తమ ఉత్పత్తుల వాడకం పెరుగుతుందని ఫినోలెక్స్ అంచనా వేస్తోంది. అందుకే తమ ఉత్పత్తి సామర్ద్యాన్నిపెంచడంతో..ఆదాయం పెరుగుతుందని భావిస్తోంది.

ఎల్ అండ్ టి ఫైనాన్స్ హోల్డింగ్స్
పెట్టుబడి పెట్టిన ఫండ్ : ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్
సిఎంపి: రూ.166
మార్కెట్ కేపిటలైజేషన్: రూ.33247కోట్లు

వివిధ రంగాల్లో వ్యాపారం చేస్తోన్న ఎల్ అండ్ టి ఫైనాన్స్ హోల్డింగ్స్ రిటన్ ఆన్ ఈక్విటీ అంశంపై దృష్టి కేంద్రీకరించింది. ఖర్చు తగ్గించుకునేందుకు పోర్ట్‌ఫోలియోలోని ఉత్పత్తులను కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 16శాతం రిటన్ ఆన్ ఈక్విటీ సాధించింది. ఇది గత ఏడాది అదే సమయంతో పోల్చితే 12.8శాతం మాత్రమే ఉండటం గమనార్హం. హోల్‌సేల్ వ్యాపారంలో పెరుగుతున్న మొండిబకాయిలను తగ్గించే వ్యూహం కూడా ఎల్ అండ్ టి హోల్డింగ్స్ సిధ్దం చేసుకుందని తెలుస్తోంది. తొందర్లోనే కంపెనీ టర్న్అరౌండ్ కావచ్చని అంచనా

సుదర్శన్ కెమికల్స్
పెట్టుబడి పెట్టిన ఫండ్: ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్
సిఎంపి: రూ.508
మార్కెట్ కేపిటలైజేషన్: రూ. 3509కోట్లు

రసాయనాల విభాగంలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోన్న సుదర్శన్ కెమికల్స్‌కి ఈ రంగంలో 35శాతం వాటా ఉంది.  అజో పిగ్మెంట్స్‌లో హై మార్జిన్ ఉత్పత్తులను విక్రయిస్తోన్న సుదర్శన్ కెమికల్స్ యూరప్, నార్త్ అమెరికాలోనూ తన వ్యాపారం పెంచుకోవడంపై దృష్టి సారించింది. ఖరీదైన ఉత్పత్తులవైపు మళ్లడం, భారీ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ కలిగి ఉండటం సుదర్శన్ కెమికల్స్ ఆదాయానికి దోహదపడుతుందని అంచనా.

నెస్లే ఇండియా
పెట్టుబడి పెట్టిన ఫండ్: ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్
సిఎంపి: రూ.8692
మార్కెట్ కేపిటలైజేషన్: రూ. 83807కోట్లు

మ్యాగీ నూడుల్స్ విభాగంలో భారీగా వృధ్ది నమోదు చేస్తోన్న నెస్లే ఇండియా విక్రయాల్లో కూడా సుస్థిరమైన వృధ్ది నమోదు చేస్తోంది. జిఎస్‌టి‌లో తగ్గింపు లభ్యం కావడం కూడా ప్లస్‌పాయింట్‌గా చూడాలి. పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ పెరగడం కొత్త ప్రొడక్ట్స్ లాంఛ్ చేయడం కూడా నెస్లే ఇండియా వ్యాపారానికి కలిసి వస్తోంది.Most Popular