ఫైర్ యాక్సిడెంట్‌తో NCDEXలో ట్రేడింగ్ నిలిపివేత

ఫైర్ యాక్సిడెంట్‌తో NCDEXలో ట్రేడింగ్ నిలిపివేత

నేషనల్ కమాడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్‌ఛేంజ్‌లో ట్రేడింగ్‌ను.. సోమవారం నాడు  తాత్కాలికంగా నిలిపివేశారు. ఎక్స్‌ఛేంజ్‌కు సంబంధించిన ముంబైలోని హెడ్‌క్వార్టర్స్‌లోని బేస్‌మెంట్లో మధ్యాహ్న సమయంలో అగ్నిప్రమాదం వాటిల్లింది. ఈ ప్రభావంతో తప్పనిసరిగా ట్రేడింగ్ నిలిపివేయాల్సిన పరిస్థితి తలెత్తింది.
దేశంలో రెండో అతి పెద్ద కమాడిటీస్ ఎక్స్‌ఛేంజ్‌ అయిన NCDEXలో ట్రేడింగ్ నిలిపివేయడంతో.. సోయాబీన్, సోయాఆయిల్, చిక్‌పీస్ వంటి పలు ఉత్పత్తుల ట్రేడింగ్‌పై ప్రభావం కనిపిస్తోంది.
మధ్యాహ్నం గం. 12.15 ని.ల ప్రాంతంలో ట్రేడింగ్ నిలిచిపోయినట్లు డీలర్లు చెబుతున్నారు. 
 Most Popular