లాభాల్లోకి చేరుకున్న మార్కెట్లు

లాభాల్లోకి చేరుకున్న మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి చేరుకున్నాయి. ఇవాళ ట్రేడింగ్‌ను నష్టాలతో ప్రారంభించిన సూచీలు.. మిడ్ సెషన్ సమయానికి లాభాల్లోకి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా.. మన ఇండెక్స్‌లు మాత్రం స్ట్రాంగ్‌గా ఉండడం గమనించాలి.

ప్రస్తుతం సెన్సెక్స్ 73 పాయింట్ల లాభంతో 34266.38 వద్ద ట్రేడవుతోంది. 28.5 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 10509.10 వద్ద ట్రేడవుతోంది. 77 పాయింట్లు లాభపడిన బ్యాంక్ నిఫ్టీ 25278 వద్దకు చేరుకుంది. 

ఆటోమొబైల్, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, హెల్త్‌కేర్ రంగాలతో పాటు స్మాల్ క్యాప్, మిడ్‌క్యాప్ కూడా పాజిటివ్‌గా ఉన్నాయి.

నిఫ్టీలో సిప్లా, గ్రాసిం, హీరో మోటోకార్ప్, ఏషియన్ పెయింట్స్, లుపిన్ టాప్ గెయినర్స్‌గా ఉండగా.. టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, విప్రో, ఐడియా సెల్యులార్, వేదాంత టాప్‌లూజర్స్‌గా కొనసాగుతున్నాయి.
 Most Popular