మళ్లీ పెరిగిన నష్టాలు

మళ్లీ పెరిగిన నష్టాలు

స్టాక్ మార్కెట్లు నష్టాల ట్రెండ్ కొనసాగిస్తున్నాయి. ఆరంభ స్థాయిలతో పోల్చితే.. తర్వాత  కోలుకున్నా.. హైయర్ లెవెల్స్‌లో స్వల్పంగా అమ్మకాల ఒత్తిడి ఎదురవుతోంది. ఈ ప్రభావంతో ఇండెక్స్‌లు నష్టాల ట్రెండ్‌ను కొనసాగిస్తున్నాయి.

ప్రస్తుతం 90 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 34102.25 వద్ద ట్రేడవుతోంది. 23 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 10457.70 వద్ద నిలిచింది. బ్యాంక్ నిఫ్టీ 50 పాయింట్లకు పైగా కోల్పోయింది. ఐటీ షేర్లలో అమ్మకాల జోరు కారణంగా సూచీలు దిగివచ్చాయి.

ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ, టెక్నాలజీ షేర్లు ఎక్కువగా నష్టపోతుండగా.. హెల్త్‌కేర్, ఎఫ్ఎంసీజీ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి.

ప్రస్తుతం సిప్లా, గ్రాసిం, లుపిన్, టెక్ మహీంద్రా, ఐటీసీ టాప్ గెయినర్స్‌గా ఉండగా.. టాటా మోటార్్స, ఇన్పోసిస్, ఐడియా సెల్యులార్, యాక్సిస్ బ్యాంక్, వేదాంత షేర్లు నిఫ్టీ టాప్  లూజర్స్‌గా కొనసాగుతున్నాయి.
 Most Popular