ఇన్ఫోసిస్ ఇప్పుడు పడినా...కొనొచ్చట

ఇన్ఫోసిస్ ఇప్పుడు పడినా...కొనొచ్చట

ఇన్ఫోసిస్..టెక్ జెయింట్... శుక్రవారం ప్రకటించిన ఫలితాలు బాగానే ఉన్నా..అధ్భుతంగా మాత్రం లేవు. అందుకే ఈ కంపెనీ షేరు 6శాతం వరకూ నష్టపోయింది. ఇది ముందే ఊహించారు కూడా! ఐనా..ఆర్ధిక నిపుణులు మాత్రం ఈ కంపెనీ షేరును కొనుగోలు చేయమనే సూచిస్తున్నారు. కనీసం తొమ్మిది బ్రోకరేజీ కంపెనీలు ఇన్ఫోసిస్ కంపెనీ షేరుకు బయ్ రేటింగ్ ఇచ్చాయ్. వచ్చే ఆర్ధిక సంవత్సరానికి 22-24శాతానికి ఎబిట్ మార్జిన్ గైడెన్స్ తగ్గించింది. ఇది గతంలో 23-25శాతంగా అంచనా వేశారు. ఆదాయ ఫలితాలు ప్రకటించిన తర్వాత అమెరికా ఏడిఆర్స్ కూడా 7.7శాతం పడిపోయాయ్. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే మన మార్కెట్లలోనూ ఇన్ఫోసిస్ షేరు 6శాతం వరకూ పతనం కావచ్చని మందుగానే అంచనా వేశారు. ఓపెన్ ఇంట్రస్ట్‌లో అత్యధికంగా రూ.1100 పుట్ కి 20.75లక్షల షేర్లు రికార్డయ్యాయి. ఐఐఎఫ్ఎల్ అంచనా ప్రకారం ఇదే విలువ వద్ద ఇన్ఫోసిస్ షేరుకి మద్దతు లభించవచ్చు. అదే నిరోధస్థాయిని చూస్తే రూ.1180, రూ.1200 వద్ద (ఏప్రిల్ సిరీస్‌లో ) ఉన్నట్లు ఐఐఎఫ్ఎల్ చెప్తోంది. ఈ ఏడాది జనవరి నుంచీ ఇన్ఫోసిస్ రూ.1100-రూ.1221 మధ్యలోనే రేంజ్ బౌండ్ అయి ట్రేడవటం గమనిస్తూనే ఉన్నాం

సిఎల్ఎస్ఏ
రేటింగ్- BUY

గైడెన్స్ తగ్గింపుతో ఇన్ఫోసిస్ తన 170 మిలియన్ డాలర్ల ఖర్చుతో డిజిటల్ సామర్ధ్యాన్ని పెంచుకోనుందని అంచనా. ఇది అమ్మకాలు, అమెరికాలో ఉద్యోగులను తీసుకోవడం, ఇతరత్యా జీత భత్యాలను కవర్ చేస్తుందని సిఎల్ఎస్ఏ చెప్తోంది. ఇది దాదాపు 9శాతం వృధ్ది సాధించేందుకు దోహదపడుతుందని రీసెర్చ్ సంస్థ లెక్కగడుతోంది. ఇన్ఫోసిస్ సుస్థిరత వృధ్ది సాధిస్తుందని సిఎల్ఎస్ఏ చెప్తూ..రూ.1340 టార్గెట్ ధరని కంటిన్యూ చేసింది

ఫిలిప్ కేపిటల్
రేటింగ్-BUY

గైడెన్స్ తగ్గింపు పెద్ద నిరాశాకర పరిణామంగా భావించినా కూడా, భవిష్యత్తు వృధ్దికి ఇది దోహదపడుతుందని ఫిలిప్ కేపిటల్ కూడా అభిప్రాయపడింది వ్యాపారపరిమాణం పెరగడం, టిసిఎస్‌తో పోల్చుకుంటే, గమనించదగ్గ వేల్యేషన్ తేడా ఉండటం కూడా చూడాలి. పనాయా, స్కావా డీల్స్ వల్లనే గైడెన్స్ తగ్గించాల్సి వచ్చిందే వాస్తవాన్ని కూడా గుర్తు చేసుకోవాలని ఫిలిప్ కేపిటల్ హెచ్చరించింది.

ఎడెల్వైజ్
రేటింగ్-BUY

గైడెన్స్ తగ్గింపు మార్కెట్లు ప్రతికూలంగా తీసుకుంటాయ్. దీంతో ఎడెల్వైజ్ కూడా 2019 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఎర్నింగ్ పర్ షేర్ ను 0.7 శాతం, 2020 సంవత్సరానికి 4.2శాతం తగ్గించింది. షేర్ హోల్డర్లకు రూ.13000కోట్ల మేర తిరిగి చెల్లించడం కూడా సంస్థపై వ్యయంగా పడుతుందని చెప్తోంది. ఐతే బలమైన ఆర్డర్లు సాధించడం, సాంకేతికపరమైన అంశాలపై దృష్టిలో పెట్టుకోవడం సానుకూల కారణాలుగా చూస్తోంది. అందుకే సంస్థ షేరుకు రూ. 1419 టార్గెట్ ధరని రికమండ్ చేస్తోంది

కోటక్ ఇన్సిట్యూషనల్ ఈక్విటీస్
రేటింగ్-ADD

ఈ సంస్థ ఇన్ఫీ రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ 6-8శాతం ఉండొచ్చని చెప్పడం కోటక్ ఇన్సిట్యూషనల్ ఈక్విటీస్ పాజిటివ్‌గా చూస్తోంది. అందుకే ఇన్వెస్టర్లు తమ పోర్ట్ ఫోలియోలో ఇన్ఫోసిస్‌ను చేర్చుకోమని చెప్తోంది. రూ.1250 వరకూ సంస్థ షేరు పెరుగుతుందని సూచిస్తోంది

ఐడిఎఫ్ఎస్ సెక్యూరిటీస్
రేటింగ్- OUTPERFORM

ఇన్ఫీ రెవెన్యూ గైడెన్స్ సరిగానే ఉన్నాయని ఐడిఎఫ్‌సి సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. ప్రస్తుతం షేరు నష్టపోయినా..ఇన్ఫోసిస్ వేల్యేషన్స్ రీజనబుల్‌గా ఉన్నట్లు చెప్తోంది. ఈ ఏజెన్సీ కూడా ఇన్ఫోసిస్‌కు రూ. 1250 టార్గెట్ ప్రైస్ రికమండ్ చేసింది

ఎలారా కేపిటల్
రేటింగ్: REDUCE(తగ్గించుకోండి)

22-24శాతం మధ్యలో ఉన్న ఎబిట్ గైడెన్స్ సంస్థ నడుస్తోన్న తీరుకు నిదర్శనంగా కన్పిస్తుందని రేటింగ్ ఏజెన్సీ హెచ్చరించింది. పనాయా, స్కావా సంస్థలను వదిలించుకోవడం కూడా ప్రకంపనలకు దారి తీసే పరిణామంగానే ఎలారా కేపిటల్ చెప్తోంది. అందుకే సంస్థ షేర్లను వీలైనంతగా వదిలించుకుని, టిసిఎస్‌కి కానీ, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్‌కి కానీ మళ్లడం మంచిదని సూచించింది.

కింది ఫోటోని చూస్తే ఏ సంస్థ ఇన్ఫోసి‌స్‌కి ఎలాంటి రికమండేషన్ ఇచ్చిందో గమనించవచ్చు



Most Popular