హెవీ వాల్యూమ్స్‌తో సిప్లాలో జోష్‌

హెవీ వాల్యూమ్స్‌తో సిప్లాలో జోష్‌

ఔషధ తయారీ కంపెనీ సిప్లాలో ఇవాళ తొలి గంటలో హెవీ వాల్యూమ్స్‌ నమోదయ్యాయి. 20 రోజుల సగటుతో పోలిస్తే మూడు రెట్లకు పైగా వాల్యూమ్స్‌ నమోదయ్యాయి. ప్రస్తుతం సిప్లా 4 శాతం పైగా లాభంతో రూ.579 వద్ద ట్రేడవుతోంది. గత నెల 12 తర్వాత గరిష్ట స్థాయి ఇదే కావడం విశేషం. గత కొంతకాలంగా యూఎస్‌ఎఫ్‌డీఏ అభ్యంతరాలతో పలు స్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడికి లోనవుతోండగా.. ఇవాళ అనూహ్యంగా సిప్లాకు కొనుగోళ్ళ మద్దతు లభించింది. Most Popular