అలోక్‌కు బ్యాంకర్ల షాక్

అలోక్‌కు బ్యాంకర్ల షాక్

అలోక్ ఇండస్ట్రీస్ షేర్ ధర ఇవాళ భారీగా నష్టపోతోంది. అమ్మకాల ఒత్తిడి కారణంగా లోయర్ సర్క్యూట్‌కు అలోక్ ఇండస్ట్రీస్ షేర్ పడిపోయింది.

టెక్స్‌టైల్ తయారీ కంపెనీ అయిన అలోక్ ఇండస్ట్రీస్ ఇప్పటికే దివాలా ప్రకటించగా.. ఈ బ్యాంక్‌రప్టీ కంపెనీని కొనుగోలు చేసందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్- జేఎం ఫైనాన్షియల్ కంపెనీలు ఉమ్మడిగా బిడ్ దాఖలు చేశాయి. కంపెనీని పునర్ నిర్మాణం చేస్తామంటూ వెల్లడించాయి.

అయితే.. రిలయన్స్- జేఎం అందించిన బిడ్ రుణదాతలను ఏ మాత్రం సంతృప్తి పరచకలేకపోయింది. ఈ ప్రభావంతో షేర్ ధర లోయర్ సర్క్యూట్‌కు పడిపోయింది. ఎన్‌ఎస్ఈలో 10 శాతం క్షీణించిన అలోక్ ఇండస్ట్రీస్ రూ. 3.70 వద్ద నిలిచింది.
 Most Popular