గృహ్ ఫైనాన్స్‌కు బోనస్ జోష్

గృహ్ ఫైనాన్స్‌కు బోనస్ జోష్

హౌసింగ్ ఫైనాన్స్ విభాగంలో సేవలు అందిస్తున్న గృహ్ ఫైనాన్స్ ఇవాళ భారీగా లాభపడుతోంది. తాజాగా జరిగిన బోర్డ్ సమావేశంలో డివిడెండ్‌తో పాటు బోనస్ షేర్ల జారీ అంశంపై గృహ్ ఫైనాన్స్ బోర్డ్ వర్గాలు నిర్ణయించాయి. 

రూ. 2 ఫేస్ వాల్యూ గల ఒక్కో షేరుకు రూ. 3.30 చొప్పున డివిడెండ్ అందించనున్నట్లు ప్రకటించిన కంపెనీ.. 1:1 నిష్పత్తిలో బోనస్ జారీ షేర్లను ఇష్యూ చేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం హోల్డ్ చేస్తున్న ఒక్కో షేరుకు మరొక షేర్ చొప్పున బోనస్ జారీ చేయనున్నారు.

బోనస్ జారీ ప్రభావంతో గృహ్ ఫైనాన్స్‌ షేర్‌లో భారీగా కొనుగోళ్లు జరుగుతుండగా.. ట్రేడింగ్ ప్రారంభంలోనే ఈ షేర్ దాదాపు 5 శాతం లాభాలను గడించింది. ప్రస్తుతం బీఎస్ఈలో రూ. 5.32 శాతం లాభంతో రూ. 644.95 వద్ద గృహ్ ఫైనాన్స్ ట్రేడవుతోంది. Most Popular