మార్కెట్లకు తగ్గిన నష్టాలు

మార్కెట్లకు తగ్గిన నష్టాలు

అంతర్జాతీయంగా ప్రకంపనలు.. ఇన్ఫోసిస్ ఫలితాల ప్రభావంతో ఇవాల్టి ట్రేడింగ్‌ను నష్టాలతో ఆరంభించిన సూచీలకు.. లోయర్ లెవెల్స్‌లో కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఇన్ఫోసిస్ రిజల్ట్స్ అంచనాలకు అనుగుణంగానే ఉండడం.. ఇప్పటికే వీటికి అనుగుణంగా సూచీలు డిస్కౌంట్ కావడం.. టెక్నికల్‌గా మార్కెట్లకు సపోర్ట్ లభిస్తుండడంతో.. ట్రేడర్లను కొనుగోళ్లకు ప్రోత్సాహం ఇస్తోంది.

ప్రస్తుతం 0.21 శాతం కోల్పోయిన సెన్సెక్స్ 73 పాయింట్ల నష్టంతో 34119 వద్ద ఉండగా.. 0.15 శాతం క్షీణించిన నిఫ్టీ 14.15 తగ్గి 10466 వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 5 పాయింట్ల స్వల్ప లాభాల వద్ద ట్రేడవుతోంది.

హెల్త్‌కేర్‌, మెటల్స్ రంగాల్లో కొనుగోళ్లు జరగడంతో.. సూచీలు నష్టాల నుంచి కోలుకున్నాయి. ఐటీ, టెక్నాలజీ రంగాలకు కూడా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. క్యాపిటల్స్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ రంగాలు మాత్రమే నష్టపోతున్నాయి. 
 Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');