నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

సిరియాపై అమెరికా సర్జికల్ స్ట్రైక్స్.. అలాగే ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ప్రభావంతో.. ఇవాల్టి మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. ఇన్ఫోసిస్ విషయంలో బ్రోకింగ్ హౌస్‌లు సానుకూలంగా ఉండడంతో.. గ్లోబల్ మార్కెట్లతో పోల్చితే మన ఇండెక్స్‌లలో అంతగా అమ్మకాల ఒత్తిడి కనిపించడం లేదు.

ప్రస్తుతం సెన్సెక్స్ 125 పాయింట్ల నష్టంతో 34067 వద్ద ట్రేడవుతుండగా.. 36 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 10444.90 వద్ద ట్రేడవుతోంది. కన్జూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ మాత్రమే స్వల్ప లాభాల్లో ఉండగా.. మిగిలిన అన్ని సెక్టార్లు నెగిటివ్‌గానే ఉన్నాయి.

ఐటీ, టెక్నాలజీ సెక్టార్లు భారీగా నష్టపోతున్నాయి. చమురు ధరల ప్రభావంతో ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కుంటున్నాయి.

నిఫ్టీలో ప్రస్తుతం ఎం అండ్ ఎం, సిప్లా, కోల్ ఇండియా, గ్రాసింగ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లు టాప్ గెయినర్స్‌గా ఉండగా.. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.Most Popular