సిరియాలో యూఎస్ మిసైల్ ఎటాక్స్, ఐసిస్‌ అంతానికి పంతం

సిరియాలో యూఎస్ మిసైల్ ఎటాక్స్, ఐసిస్‌ అంతానికి పంతం

ట్రంప్ అన్నంత పనీ చేశారు. సిరియాలో గ్యాస్ దాడులకు పాల్పడ్తూ పౌర సమాజంపై అకృత్యాలకు ఒడిగడ్తున్న వారిపై ఉక్కుపాదం మోపారు. బ్రిటన్, ఫ్రాన్స్ సహకారంతో సిరియాలోని వివిధ స్థావరాలపై బాంబు దాడులు నిర్వహించినట్టు ప్రకటించారు. కెమికల్ దాడులకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరిస్తూ ఏడేళ్లలో వరుసగా రెండోసారి దాడులకు దిగారు. 

సిరియా రాజధాని దమాస్కస్‌కు దగ్గర్లో ఉన్న కెమికల్ ప్రోగ్రాం రీసెర్చ్ సెంటర్, స్టోరేజ్ ఫెసిలిటీ, ఎక్విప్‌మెంట్ ఫెసిలిటీ, కమాండ్ పోస్టులపై ఏకంగా 100 మిస్సైల్స్‌తో దాడులు చేశారు. 

'' సిరియాలో ఇలాంటి కెమికల్ ఏజెంట్ల ప్రయోగం ఆగనంత వరకూ మా పోరాటం కొనసాగుతుంది. ఇదే తరహాలో బుద్ధి చెప్పేందుకు మేం సర్వసన్నద్ధంగా ఉన్నాం'' - డోనాల్డ్ ట్రంప్. 

సిరియన్ అధ్యక్షుడు బషర్ అల్ అస్సద్ సేనలు కొద్ది రోజుల క్రితం రసాయినక దాడులు చేయడంతో దమాస్కస్‌లో 42 మంది మృత్యవాతపడ్డారు. 

అయితే సిరియాపై ఇలాంటి దాడులు ట్రంప్‌కు కొత్తేం కాదు. గతేడాది ఏప్రిల్‌లో కూడా ఉత్తర కొరియాలోని స్థావరాలపై దాడులకు దిగారు. అల్ షయరత్ ఎయిర్‌బేస్‌పై 59 మిస్సైల్స్‌ను ప్రయోగించారు. అప్పట్లో కూడా బషర్ అల్ అస్సద్ సేనలు చేసిన కెమికల్ అటాక్స్‌లో సుమారు 80 మంది ప్రాణాలు కోల్పోయారు. 

సిరియాలో ఉన్న ఐసిస్ సేనలను తుదముట్టించేందుకు ఇప్పటికే అక్కడ వేలాది సంఖ్యలో యూఎస్ బలగాలు అక్కడ సర్వసన్నద్ధంగా ఉన్నాయి. ఈ మధ్యే రెండు వేల మందిని వెనక్కి పిలవబోతున్నట్టు ట్రంప్ ప్రకటించి వారం, పది రోజులైనా కాకముందే ఈ స్థాయిలో మెరుపు దాడులకు దిగారు. Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');