మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకున్న కొత్త స్టాక్స్ ఇవే

మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకున్న కొత్త స్టాక్స్ ఇవే

మార్చ్ నెలలో భారత ఈక్విటీ మార్కెట్లు 3 శాతం నష్టాలను నమోదు చేశాయి. అలాగే మ్యూచువల్ ఫండ్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ(అసెట్ అండర్ మేనేజ్మెంట్) కూడా దిగి వచ్చింది. 2018 ఫిబ్రవరి చివరకు రూ. 22.20 లక్షల కోట్లుగా ఉన్న ఏయూఎం.. మార్చ్ చివరకు రూ. 21.36 లక్షల కోట్లకు తగ్గింది.
మార్చి చివరకు ఈక్విటీ( ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్), బ్యాలెన్స్‌డ్.. ఇతర ఈటీఎఫ్‌ల ఏయూఎం.. రూ. 9.95 లక్షల కోట్లుగా ఉండగా.. ఫిబ్రవరి చివరకు ఇది రూ. 10.21 లక్షల కోట్లుగా ఉంది. మార్చ్ 2017 నాటి స్థాయి రూ. 6.73 లక్షల కోట్లతో పోల్చితే ఇది 47.9 శాతం ఎక్కువ.
మార్చి నెలలో దేశీయ మ్యూచువల్ ఫండ్ సంస్థలు నికర ఈక్విటీ కొనుగోలుదారులుగా నిలిచారు. మొత్తం 19 ట్రేడింగ్ సెషన్స్‌కు గాను.. రూ. 9255 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. ఫిబ్రవరిలో ఇది రూ. 16180 కోట్లుగా ఉంది.

తొలిసారిగా ఎంచుకున్న స్టాక్స్
మార్చ్ నెలలో ఫండ్ మేనేజర్లు 15 స్టాక్స్‌ను కొత్తగా ఎంపిక చేసుకున్నారు. వీటిలో తాజా ఐపీఓలు అయిన బంధన్ బ్యాంక్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, భారత్ డైనమిక్స్, సంధార్ టెక్నాలజీస్, లెమన్ ట్రీ, మిశ్రధాతు నిగమ్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ వంటి కంపెనీలు కూడా ఉన్నాయి.

బంధన్ బ్యాంక్‌లో ఫండ్ మేనేజర్లు రూ. 13వందల కోట్లను ఇన్వెస్ట్ చేయడం విశేషం. ఇప్పటి వరకూ బ్యాంకింగ్ సదుపాయాలు అసలు లేని.. పరిమితంగా మాత్రమే ఉన్న ప్రాంతాలను బంధన్ బ్యాంక్ ఫోకస్ చేసింది. 29.5 శాతం శాఖలు అసలు బ్యాంకింగ్ సదుపాయం లేని గ్రామీణ ప్రాంతాలలో ఉండగా.. ఈ బ్యాంక్ ఇచ్చిన రుణాలలో 96.49 శాతం పీఎస్ఎల్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నవే కావడం విశేషం.

మ్యూచువల్ ఫండ్ కంపెనీలు కొత్తగా ఎంపిక చేసుకున్న స్టాక్స్ జాబితాను ఓ సారి చూద్దాం.

ఎగ్జిట్ తీసుకున్న స్టాక్స్
మరోవైపు.. కొన్ని స్టాక్స్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ వైదొలగడం కూడా మార్చ్ నెలలో కనిపించింది. మొత్తం 8 స్టాక్స్ నుంచి ఫండ్స్ ఎగ్జిట్ తీసుకున్నాయి. వీటిలో పోకర్ణ, జయ్ భారత్ మారుతి, అవధఅ షుగర్ అండ్ ఎనర్జీ, వెల్‌స్పన్ కార్ప్, ఎంబీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హెక్సా ట్రేడెక్స్, శ్రేయ షిప్పింగ్, అర్వింద్ స్మార్ట్‌స్పేసెస్ ఉన్నాయి.
 Most Popular