క్యూ4లో రెట్టింపునకు పైగా లాభాలు సాధించబోయే కంపెనీలివే!

క్యూ4లో రెట్టింపునకు పైగా లాభాలు సాధించబోయే కంపెనీలివే!

2019 ఆర్థిక సంవత్సరంలోకి వచ్చేశాం. ఎర్నింగ్స్ సీజన్‌ కూడా ప్రారంభం అయిపోయింది. జనవరి- మార్చ్ త్రైమాసికానికి తమ ఆదాయాలను ప్రకటించడం కంపెనీలు ప్రారంభించాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు సగటున రెండంకెల వృద్ధి సాధ్యమనే అంచనాలు వినిపిస్తున్నాయి.
గత మూడేళ్లుగా కంపెనీల ఆదాయాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఆర్థిక పాలసీలలో మార్పులు అత్యధికంగా ప్రభావం చూపంగా.. బ్యాంకింగ్ సెక్టార్‌లో ఆస్తుల నాణ్యత దెబ్బతినడం కనిపించింది.

“క్యూ3 నుంచి పలు రంగాలకు చెందిన ఆదాయాలు మెరుగు అవుతున్నాయి. ఇది క్యూ4 లో కూడా కొనసాగే అవకాశం ఉంది. 2019లో 20 శాతం వృద్ధి అందుకోవచ్చు,” అని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటోంది. 

వినియోగం పెరుగుతోందని.. ఇది ఆదాయాలపై ప్రభావం చూపనుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పీఎస్‌యూ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు పెర్ఫామెన్స్ పరంగా కొంత ఒత్తిడి ఎదుర్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇలాంటి సమయంలో తమ నికర లాభాలను రెట్టింపునకు పైగా ప్రకటించబోతున్నాయని.. బ్రోకరేజ్ హౌస్‌లు అంచనా వేస్తున్న కంపెనీల జాబితాను ఓ సారి పరిశీలిద్దాం.

 

భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్: నికర లాభం పెరిగే అవకాశం 180% YoY
మార్చ్‌తో ముగిసిన త్రైమాసికంలో భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 180 శాతం పెరగవచ్చని ఎడెల్‌వీస్ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. గతేడాది ఇదే సమయంలో రూ. 234.90 కోట్ల నష్టాన్ని కంపెనీ ప్రకటించింది. ఆస్తుల నాణ్యత మెరుగవుతోందని తెలిపింది.

 

ఈక్విటాస్ హోల్డింగ్స్: నికర లాభం పెరిగే అవకాశం 280% YoY
ఈక్విటాస్ హోల్డింగ్స్ నికర లాభం 280 శాతం మేర పెరిగి.. రూ. 26.20 కోట్లకు చేరవచ్చని ఎడెల్‌వీస్ అంటోంది. గతేడాది క్యూ4లో రూ. 6.9 కోట్ల లాభాలను కంపెనీ ప్రకటించింది. నికర వడ్డీ ఆదాయం 17.5 శాతం పెరిగి రూ. 282.90 కోట్లకు చేరవచ్చని చెబుతోంది.

 

హావెల్స్ ఇండియా: నికర లాభం పెరిగే అవకాశం 116% YoY
హావెల్స్ ఇండియా స్టాండలోన్ నికర లాభం 116 శాతం పెరగొచ్చని బ్రోకరేజ్ సంస్థ ఎడెల్‌వీస్ అంచనా వేస్తోంది. గతేడాది క్యూ4లో రూ. 94.7 కోట్ల లాభాలను గడించిన కంపెనీ.. ఈ సారి రూ. 205.4 కోట్లు ప్రకటించవచ్చని అంటోంది. ఆదాయాలు 19 శాతం పెరగవచ్చని చెబుతోంది.

 

ఎన్ఎండీసీ: నికర లాభం పెరిగే అవకాశం 122% YoY
క్యూ4లో ఎన్ఎండీసీ నికర లాభం 122 శాతం పెరిగి రూ. 1140  కోట్లకు చేరవచ్చని ఎడెల్‌వీస్ అంటోంది. గతేడాది ఇదే కాలంలో రూ. 511.90 కోట్ల నెట్ ప్రాఫిట్ గడించగా.. ఈ సారి రూ. 1140 కోట్లకు చేరవచ్చని చెబుతోంది.

 

ఇప్కా ల్యాబరేటరీస్: నికర లాభం పెరిగే అవకాశం 209% YoY
నాలుగో త్రైమాసికంలో ఇప్కా ల్యాబరేటరీస్ నికర లాభం 209 శాతం పెరగవచ్చని ఎడెల్‌వీస్ చెబుతోంది. గతేడాది ఇదే కాలంలో రూ. 27.1  కోట్లను గడించిన ఈ కంపెనీ.. ఇప్పుడు రూ. 83.80 కోట్ల నికర లాభాన్ని ప్రకటించవచ్చని అంచనా వేస్తోంది.

 

జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్: నికర లాభం పెరిగే అవకాశం 313% YoY
క్యూ4లో జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ నికర లాభం 313 శాతం పెరిగి రూ. 61.7 కోట్లకు చేరవచ్చని మోతీలాల్ ఓస్వాల్ అంటోంది. అమ్మకాలు 22.8 శాతం పెరగనుండగా.. సేమ్ స్టోర్ సేల్స్ వృద్ధి 20 శాతం పెరగవచ్చని అంచనా వేస్తోంది.

 

జెన్సార్ టెక్నాలజీస్: నికర లాభం పెరిగే అవకాశం 562% YoY
జెన్సార్ టెక్నాలజీస్ నికర లాభం 562 శాతం పెరిగి రూ. 68.8 కోట్లకు చేరవచ్చని మోతీలాల్ ఓస్వాల్ చెబుతోంది. ప్రస్తుతం ఈ స్టాక్ FY19 ఆదాయానికి 14.3 రెట్ల వద్ద..  FY20 ఆదాయానికి 10.9 రెట్ల వద్ద ట్రేడవుతోంది.


డెల్టా కార్ప్: నికర లాభం పెరిగే అవకాశం 286% YoY
క్యూ4లో డెల్టా కార్ప్ నికర లాభం 286 శాతం పెరిగి రూ. 44 కోట్లకు చేరవచ్చని మోతీలాల్ ఓస్వాల్ చెబుతోంది. ఆదాయం 42 శాతం పెరిగి రూ. 153.5 కోట్లకు చేరవచ్చని అంటోంది.

 

ఇన్ఫో ఎడ్జ్: నికర లాభం పెరిగే అవకాశం 105% YoY
మార్చ్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫో ఎడ్జ్ నికర లాభం 105 శాతం పెరిగి రూ. 35.6 శాతానికి చేరవచ్చని మోతీలాల్ ఓస్వాల్ అంటోంది.

 

నవనీత్ ఎడ్యుకేషన్: నికర లాభం పెరిగే అవకాశం  131% YoY
క్యూ4లో నవనీత్ ఎడ్యుకేషన్ నికర లాభం 131 శాతం పెరిగే అవకాశం ఉందని.. రూ. 39 కోట్లుగా లాభం నమోదు కావచ్చని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేస్తోంది. ఆదాయం 47 శాతం పెరిగి రూ. 307.4 కోట్లకు చేరవచ్చని అంటోంది.Most Popular