వందల కోట్లు ఇన్వెస్ట్ చేసి క్లెయిమ్ చేసుకోని లక్ష మంది మదుపర్లు

వందల కోట్లు ఇన్వెస్ట్ చేసి క్లెయిమ్ చేసుకోని లక్ష మంది మదుపర్లు


లక్షలు.. కోట్లు ఇన్వెస్ట్ చేసి.. వాటిని మర్చిపోవడం.. క్లెయిం చేసుకోకుండా ఉండిపోవడం సాధ్యమేనా? అంత మొత్తాన్ని ఎవరు వదులుకుంటారు అనుకోవచ్చు కానీ.. మార్కెట్లలో కనిపించే చిత్రాలలో ఇవి కూడా ఉంటాయి. బీఎస్ఈ 100 జాబితాలో లిస్ట్ అయిన షేర్లలోనే.. వందల కోట్ల రూపాయల మొత్తాన్ని ఇన్వెస్టర్లు క్లెయిమ్ చేసుకోలేదు.

ఈ మొత్తం విలువ ఎంతో తెలుసా? రూ. 1302 కోట్లు కంపెనీలలో అన్‌క్లెయిమ్డ్ విభాగంలో మూలుగుతున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉండవచ్చు. ఇన్వెస్ట్ చేసిన వారి వారసులకు ఆ పెట్టుబడుల గురించి తెలియకపోవడం.. ఒకవేళ షేర్ సర్టిఫికెను పోగొట్టుకుంటే తర్వాత వాటిని పట్టించుకోకపోవడం వంటివి కావచ్చు.

 

ఐటీసీ
ఇలా అన్ క్లెయిమ్డ్ షేర్స్ అధికంగా ఉన్న జాబితాలో పొగాకు ఉత్పత్తుల సంస్థ ఐటీసీ ప్రథమ స్థానంలో ఉంది. 2017 డిసెంబర్ చివరి వరకూ ఉన్న గణంకాల ప్రకారం ఈ కంపెనీకి చెందిన 1.37 కోట్ల షేర్లను ఎవరకూ క్లెయిమ్ చేసుకోవడం లేదు. ఈ షేర్ల విలువ రూ. 360 కోట్ల రూపాయలు అంటే ఆశ్చర్యం వేక మానదు. 

ఇతర షేర్లు
అలాగే టైటాన్ విషయంలో కూడా అన్‌క్లెయిమ్డ్ షేర్ల విలువ ఎక్కువగానే ఉంది. 17.1 లక్షల షేర్లు ఇలా ఎవరూ క్లెయిమ్ చేసుకోని జాబితాలో ఉండిపోగా.. వీటి వాల్యూ రూ. 160 కోట్లు. వేదాంతకు చెందిన 34 షేర్లు ఇలా ఉండిపోగా వీటి వాల్యూ రూ. 95.7 కోట్లు.
ఐటీసీ విషయంలో 7083 మంది, టైటాన్ 1502 మంది, వేదాంత 3950 మంది ఇన్వెస్టర్లు ఇలా షేర్లను క్లెయిమ్ చేసుకోకుండా ఉండిపోయారు. వీటిని ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్‌కు తరలించాల్సి ఉంటుంది.

 
2013 కంపెనీల చట్టం ప్రకారం ట్రాన్స్‌ఫర్ నిబంధనలు అమల్లోకి వచ్చాయిని నిపుణులు చెబుతున్నారు. గతంలో ఏడేళ్ల పాటు క్లెయిమ్ చేయని డివిడెండ్స్‌ను ఐఈపీఎఫ్‌కు కంపెనీలు బదలాయించేవని.. ఇప్పుడు 2016 నిబంధనల ప్రకారం షేర్లను కూడా ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఏడేళ్లలో కనీసం ఒకసారి డివిడెండ్‌ను క్లెయిమ్ చేసుకున్నట్లు అయితే, ఇలా డివిడెండ్లు ట్రాన్స్‌ఫర్ కాకుండా నిలుపుదల చేయవచ్చని ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు.
ఏడేళ్లలో ఒకసారి అయినా డివిడెండ్ క్లెయిమ్ చేస్తే.. షేర్ల ట్రాన్స్‌ఫర్ కూడా నిలపవచ్చు.

అయితే కొన్ని బదలాయింపులు జరిగాయి. '2017 డిసెంబర్ 31 నాటికి 2,124 మంది షేర్‌హోల్డర్లకు చెందిన 1,11,070 క్లెయిమ్ చేయని ఈక్విటీ షేర్లను ఐఈపీఎఫ్‌కు చెందిన బెనిఫిషియరీ ఎకౌంట్‌కు.. కంపెనీస్ యాక్ట్ 2013 సెక్షన్ 124(6) ప్రకారం ట్రాన్స్‌ఫర్ చేశాం. ఇందులో 116 మందికి చెందిన 45,629షేర్లను సెబీ రెగ్యులేషన్ 36 ప్రకారం నివేదించడం జరిగింది' అంటూ జీ ఎంటర్‌ప్రైజెస్ వెల్లడించింది. 
కొన్ని ఫ్రాడ్ ట్రాన్స్‌ఫర్స్‌ను గమనించిన తర్వాత ఇలా బదలాయింపు చేయడం తప్పనిసరి అనే నిబంధన అమల్లోకి వచ్చింది. 
2016 మార్చ్ 22న ఇచ్చిన ఆదేశాలలో ట్రాన్స్‌‌ఫర్ ఏజెంట్ షేర్‌ప్రో సర్వీసెస్‌ను సెబీ డిబార్ చేసింది. పలువురికి చెందిన అన్‌క్లెయిమ్డ్ డివిడెండ్స్‌ను నేరపూరితంగా బదలాయించిన విషయాన్ని సెబీ గుర్తించింది.
ప్రభుత్వం కస్టోడియన్‌గా ఉండడంతో ఈ బదలాయింపుల కారణంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాబోవని నిపుణులు చెబుతున్నారు. రీఫండ్ క్లెయిమ్ ద్వారా అర్హులు ఐపీఈఎఫ్‌ నుంచి తిరిగి వీటిని పొందవచ్చు.
 Most Popular