గెట్ రెడీ రష్యా.. ! మిస్సైల్స్‌ కమింగ్ అంటూ ట్రంప్ దుమారం

గెట్ రెడీ రష్యా.. ! మిస్సైల్స్‌ కమింగ్ అంటూ ట్రంప్ దుమారం

డోనాల్డ్ ట్రంప్ మరోసారి కయ్యానికి కాలు దువ్వుతున్నారు. రష్యాకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. 
గ్యాస్‌తో ప్రాణాలు తీస్తున్న క్రూరమైన జంతువును మీరు మద్దతు ఇవ్వడం అభ్యంతరకమని డోనాల్డ్ ట్రంప్ రష్యాను మందలించారు. ఒక వేళ మీరు మాతో తలపడాలని చూస్తే నూతన, శక్తివంతమైన, స్మార్ట్ మిస్సైల్స్ మీకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. 
ఈ మధ్య సిరియాలో జరుగుతున్న మారణకాండకు రష్యా పరోక్ష మద్దతునివ్వడంతో పాటు ఇలాంటి చర్యలను అణచివేస్తామని చెప్పిన అమెరికాపై కూడా వ్యతిరేకంగా మాట్లాడ్తోంది. ఒక వేళ అమెరికా దేశం.. సిరియాపై యుద్ధాన్ని ప్రకటిస్తే.. మద్దతునిచ్చేందుకు రష్యా సిద్ధపడడం కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. 
తాజాగా రష్యాపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి స్టాక్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపే అవకాశాన్ని మనం కొట్టిపారేయలేం. ట్రంప్ ట్వీట్లపై రష్యా ఎలా స్పందిస్తుంది, తర్వాత ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ రెండు దేశాల చర్యలను మార్కెట్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');