ఈ 3 మిడ్‌ క్యాప్స్‌ షేర్లకూ దూకుడెక్కువే!

ఈ 3 మిడ్‌ క్యాప్స్‌ షేర్లకూ దూకుడెక్కువే!

ఇటీవల దూకుడు చూపుతున్న మూడు మిడ్‌ క్యాప్‌ కౌంటర్లు మరోసారి లాభాల దుమ్ము రేపుతున్నాయి. మౌలిక సదుపాయాల సంస్థ దిలీప్‌ బిల్డ్‌కాన్‌, ఆఫ్‌రోడ్‌ టైర్ల తయారీ దిగ్గజం బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, వ్యవసాయ పంపు సెట్ల తయారీ సంస్థ శక్తి పంప్స్‌ తాజాగా బీఎస్‌ఈలో సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి.  గత కొంత కాలం నుంచీ ప్రోత్సాహకర పనితీరును చూపుతూ రావడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లలో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతూ వస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ 3 కౌంటర్లూ గత నెల రోజుల్లో 26 శాతం జంప్‌చేయడం విశేషం!
రేసు గుర్రాల్లా 
ప్రస్తుతం 2 శాతం పెరిగి రూ. 1196 వద్ద ట్రేడవుతున్న దిలీప్‌ బిల్డ్‌కాన్‌ తొలుత రూ. 1217 వరకూ ఎగసింది. ఇది సరికొత్త రికార్డుకాగా.. ఈ బాటలో బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ రూ. 1314ను అధిగమించింది. ప్రస్తుతం 2 శాతం లాభంతో రూ. 1288 వద్ద ట్రేడవుతోంది. ఇక రూ. 753 వద్ద రికార్డ్‌ గరిష్టాన్ని తాకిన శక్తి పంప్స్‌ 14 శాతం దూసుకెళ్లి రూ. 740 వద్ద ట్రేడవుతోంది.Most Popular