మీనవల్లి-స్టాంపేడ్ దోపిడీ

మీనవల్లి-స్టాంపేడ్ దోపిడీ
 • నార్త్ గేట్ టెక్నాలజీస్ ప్రమోటర్ మీనవల్లి వెంకట్ బృందం అక్రమాలపై అమెరికన్ రెగ్యులేటరీ సంస్థల దర్యాప్తు
 • నాస్ డాక్ లిస్టెడ్ కంపెనీ లాంగ్ ఫిన్ కార్ప్ షేర్లలో ట్రేడింగ్ సస్పెన్షన్
 • లాంగ్ ఫిన్ కార్ప్ లో మెజారిటీ వాటా కలిగి ఉన్న భారతీయ సంస్థ స్టాంపేడ్ క్యాపిటల్
 • స్టాంపేడ్ క్యాపిటల్ బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ లిస్టెడ్ సంస్థ
 • ఒకప్పుడు మితిమీరిన స్పెక్యులేషన్ తో మూడంకెల్లో ట్రేడయిన స్టాంపేడ్ క్యాపిటల్
 • ప్రస్తుతం రూ.6 ధరతో రోజువారీ పతనం అవుతున్న స్టాంపేడ్ షేర్లు
 • అమెరికాలో అమల్లో ఉన్న జాబ్స్ యాక్ట్ రెగ్యులేషన్ ఎ ప్లస్ చట్టాన్ని అదనుగా లాంగ్ ఫిన్ షేర్ల లిస్టింగ్
 • అమెరికా చట్టంలో లొసుగులు అడ్డం పెట్టుకుని షేర్లు అక్రమంగా అమ్ముకునే ప్రయత్నం చేసి దొరికిపోయిన మీనవల్లి వెంకట్ 
 • అమెరికాలో కేవలం ముగ్గురు ఉద్యోగులతో 3 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన వెంకట్ మీనవల్లి సంస్థ లాంగ్ ఫిన్ కార్ప్ 
 • భారత్ లో మొదట నార్త్ గేట్ టెక్నాలజీస్, భారత్ స్టూడెంట్ డాట్ కామ్ సంస్థలను ప్రమోట్ చేసి సొమ్ము సమీకరించిన వెంకట్ 
 • అనంతరం నార్త్ గేట్ పేరును గ్రీన్ ఫైర్ అగ్రి కమాడిటీస్ గా ఆపై ప్రొసీడ్ ఇండియాగా పేర్లు మార్పిడి
 • కంపెనీలు ప్రారంభించి, సొమ్ము సేకరించి, ఆపై సంస్థల పేర్లు మార్చి మాయం కావడం వెంకట్ మీనవల్లికి వెన్నతో పెట్టిన విద్య
 • స్టాంపేడ్ క్యాపిటల్, లాంగ్ ఫిన్ కార్ప్ వంటి సంస్థల ఉదంతాలు ఇన్వెస్టర్లకి గుణపాఠాలు


Most Popular