డీ-మార్ట్ జోరు చూశారా?2018కి బెస్ట్ మిడ్‌క్యాప్ ఇదే!

డీ-మార్ట్ జోరు చూశారా?2018కి బెస్ట్ మిడ్‌క్యాప్ ఇదే!

అవెన్యూ సూపర్ మార్ట్స్ షేర్ దూసుకుపోతూనే ఉంది. తొలిసారిగా రూ. 90వేల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను ఈ షేర్ అధిగమించింది. మంగళవారం నాడు తొలిసారిగా ఈ మార్క్‌ను అధిగమించిన డీ-మార్ట్ రూ. 92 వేల మార్క్‌కు చేరుకుంది. 
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా.. డీమార్ట్ ఇప్పుడు 33వ స్థానానికి చేరుకోవడం విశేషం. 

రికార్డ్ గరిష్టానికి షేర్
మంగళవారం నాడు ఇంట్రాడేలో రూ. 1479 మార్క్‌ను అందుకుంది అవెన్యూ సూపర్ మార్కెట్స్. ఇష్యూ ధరతో పోల్చితే లిస్టింగ్‌కే 100 శాతం లాభాలను పంచిన ఈ స్టాక్.. ఆ తర్వాత 131 శాతం మేర పెరగడం విశేషం. మొత్తంగా ఐపీఓలో ఆఫర్ చేసిన ఇష్యూ ధర రూ. 399తో పోల్చితే.. ప్రస్తుతం 394 శాతం మేర అధిక ధరకు అవెన్యూ సూపర్‌మార్ట్స్ ట్రేడవుతోంది.

ఇంకా కొనచ్చు
ఈ స్థాయిలో కూడా డీ-మార్ట్ షేర్‌ను కొనుగోలు చేయవచ్చని అంటోంది జేఎం ఫైనాన్షియల్. 12 నెలల కాలానికి గాను.. రూ. 1675 టార్గెట్‌తో ఈ స్టాక్‌కు బయ్ రేటింగ్ ఇస్తున్నట్లు జేఎం ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషనల్ సెక్యూరిటీస్ వెల్లడించింది. అదే స్టోర్‌లో విక్రయాలు 20 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని.. రాబోయే 24 నెలలు ఈ స్టాక్‌కు సానుకూలంగా ఉండొచ్చని ఎడెల్‌వీస్ చెబుతోంది. 
 Most Popular