షార్ట్‌టెర్మ్ కోసం ఈ 2 స్టాక్స్‌పై బెట్ చేయచ్చు

షార్ట్‌టెర్మ్ కోసం ఈ 2 స్టాక్స్‌పై బెట్ చేయచ్చు

నిఫ్టీలో షార్ట్‌టెర్మ్ పుల్ బ్యాక్ కనిపిస్తోంది. 10వేల పాయింట్ల కీలక స్థాయికి చేరుకున్న నిఫ్టీ.. ఇప్పుడు మళ్లీ 10400 పాయింట్లకు చేరువైంది. 10300-10350 పాయింట్ల వద్ద ఉన్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్‌ను నిఫ్టీ అధిగమించగలిగింది.
డైలీ మూవింగ్ యావరేజ్‌ల ప్రకారం మరింతగా పుల్‌బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లపై పట్టు బిగించేందుకు బుల్స్ ప్రయత్నాలు మళ్లీ ఎక్కువ అవుతుండగా.. బేర్స్ గ్రిప్ మెల్లగా సడలుతోంది.
వీక్లీ, మంత్లీ ఛార్టుల ప్రకారం కూడా ఇండెక్స్‌లో మరింతగా మూమెంటం కనిపించే అవకాశాలు ఉన్నాయి. 10290 లెవెల్‌ బ్రేక్ అయితే మాత్రం 10,000-9,950 టార్గెట్‌తో షార్ట్‌ పొజిషన్స్ తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 
అయితే బుల్స్ డామినేషన్ కొనసాగితే మాత్రం 10400-10440 పాయింట్ల వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ జోన్ ఉంది. దీన్ని అధిగమించితే 10,560 & 10,700 టార్గెట్స్‌తో నిఫ్టీ దూసుకుపోవచ్చు. ఇలాంటి సమయంలో ఈ కింది 2 ట్రేడింగ్ అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ ఎనలిస్ట్‌లు చెబుతున్నారు.

 

జీ ఎంటర్టెయిన్మెంట్ ఫ్యూచర్స్: Sell | స్టాప్‌లాస్- రూ. 597 | టార్గెట్ రూ. 518
కాంప్లెక్స్ కరెక్షన్‌ను ఫామ్ చేసేందుకు జీ ఎంటర్టెయిన్మెంట్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం వచ్చిన బౌన్స్ కరెక్షన్‌లో భాగంగా వచ్చిన భాగం అని చెప్పవచ్చు. మరుసటి రౌండ్ సెల్లింగ్ ఈ కౌంటర్‌లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

టాటా గ్లోబల్: Buy | స్టాప్‌లాస్ రూ. 267 | టార్గెట్ రూ. 299
పలు వారాలు పతనం అయిన తర్వాత టాటా గ్లోబల్ షేర్‌కు రూ. 255- 250 స్థాయిలో సపోర్ట్ జోన్ లభించింది. ఈ స్థాయి వద్ద పలు పారామీటర్స్ ప్రకారం మద్దతు లభిస్తుండడంతో.. ఫ్రెష్ ర్యాలీ కనిపించవచ్చు. Most Popular