ఐపీవోకు ఇండోస్టార్‌ కేపిటల్‌ ఫైనాన్స్‌ రెడీ!

ఐపీవోకు ఇండోస్టార్‌ కేపిటల్‌ ఫైనాన్స్‌ రెడీ!

నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ) ఇండోస్టార్‌ కేపిటల్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. ఇందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఐపీవోకు అనుమతించాల్సిందిగా ఇండోస్టార్‌ జనవరిలో సెబీకి దరఖాస్తు చేసుకుంది. కాగా.. ఐపీవో ద్వారా రూ. 1,000 కోట్లను సమీకరించాలని ఇండోస్టార్‌ భావిస్తోంది.
ఐపీవోలో భాగంగా ఇండోస్టార్‌ రూ. 700 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌చేసిన వాటాదారులు మరో 2 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఐపీవో నిధులను భవిష్యత్‌ పెట్టుబడుల అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది.Most Popular