హెల్త్ ఇన్సూరెన్స్ తీస్కుంటున్నారా? ఈ ఐదు పాయింట్లు చెక్ చేస్కోండి!

హెల్త్ ఇన్సూరెన్స్ తీస్కుంటున్నారా? ఈ ఐదు పాయింట్లు చెక్ చేస్కోండి!

ఆరోగ్య ఖర్చులు అనూహ్య స్థాయిలో పెరుగుతుండడంతో, కుటుంబానికి తగిన భద్రత కల్పించేందుకు గల ఏకైక మార్గం ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడమే. వేతనజీవుల్లో అనేక మందికి గ్రూప్ ఇన్సూరెన్స్ కవర్ ఉండే అవకాశం ఉంది. అయినా సరే వ్యక్తిగత కవర్ ఉండడం, దాన్ని ప్రతీ ఏటా రెన్యువల్ చేసుకోవడం చాలా ప్రధానం. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80డీ ప్రకారం, స్వయం-భాగస్వామి-ఆధారపడిన పిల్లలకు చేసిన హెల్త్‌ ఇన్సూరెన్స్ కోసం చెల్లింపులపై రూ. 25వేల వరకూ పన్ను మినహాయింపును పొందవచ్చు.
ప్రస్తుతం దాదాపు అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలలోను ఎంట్రీ ఏజ్ గరిష్ట పరిమితిని 65 ఏళ్ల వరకు అనుమతి ఇస్తున్నారు. అయితే.. ఒకసారి ప్రపోజల్‌ను యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎగ్జిట్ విషయంలో మాత్రం గరిష్ట పరిమితి ఉండదు. కానీ మధ్యలో ఎలాంటి బ్రేక్ రాకుండా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రెన్యువల్ సమయంలో సమ్ అస్యూర్డ్‌ను పెంచుకునే సదుపాయం కూడా ఉంటుంది.

 

టాప్అప్

అయితే, ఒకో సమయంలో కుటుంబ ఆరోగ్య అవసరాలు ఎక్కువగా ఉంటాయి. అంత మొత్తానికి ఒకే కంపెనీ ఆరోగ్య బీమా ఇవ్వకపోవచ్చు. అందుకే ఒక్కోసారి టాప్అప్ ప్లాన్‌ను ఎంచుకోవాల్సి రావచ్చు. దీంతో సాధారణ మొత్తం కంటే అదనపు కవరేజ్ పొందవచ్చు. ప్రాథమికంగా బీమా తీసుకున్న మొత్తానికి ఇది అదనం కావడంతో.. బీమా రక్షణ మరింతగా లభిస్తుంది. 
ప్రస్తుతం మార్కెట్‌లో అనేక బీమా ఉత్పత్తులు అందుబాటులో ఉండడంతో వీటిలోంచి ఏది ఎంచుకోవాలనే అంశంపై తుది నిర్ణయానికి రావడం కష్టం అవుతూ ఉండవచ్చు. అందుకే ఆయా కంపెనీల వెబ్‌సైట్లను సందర్శించడం ద్వారా, ఆయా ఉత్పత్తి వివరాలు, నిబంధనలు, మినహాయింపులు, నెట్వర్క్ హాస్పిటల్స్, ప్రీమియం వంటి అంశాలపై అవగాహన తెచ్చుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే ముందు ఈ 5 అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలి. 

బీమా ఇచ్చేందుకు ముందు హెల్త్ చెక్-అప్
పాలసీ తీసుకునే సమయంలో బీమా పొందే వ్యక్తి వయసు 45 సంవత్సరాలకు మించినట్లయితే.. ఆ వ్యక్తిని హెల్త్ చెక్-అప్ చేయించాల్సిందిగా బీమా కంపెనీలు కోరవచ్చు. ఎక్కువ మొత్తానికి బీమా కోరుతున్నపుడు కూడా చెక్-అప్ అవసరం రావచ్చు. ఆయా బీమా కంపెనీలు అనుసంధానం అయిన ఆసుపత్రులలో, రెగ్యులేటరీ నిబందనలు అనుగుణంగా వీటిని చేయించాల్సి ఉండగా, ఈ పరీక్షలకు అవసరం అయ్యే ఖర్చులో సగాన్ని బీమా కంపెనీ భరిస్తుంది.

 

క్లెయిమ్ కోసం చికిత్స పరంగా పరిమితులు
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ట్రీట్మెంట-వైజ్ పరిమితులను తప్పనిసరిగా పరిశీలించాలి. బీమా ఇచ్చే కంపెనీ పరిమితిని మించి క్లెయిం చేయినట్లు అయితే, పరిమితి కంటే అదనపు మొత్తాన్ని ఆ వ్యక్తులే భరించాల్సి ఉంటుంది. అయితే పలు కంపెనీలు హాస్పిటలైజేషన్ సమయమంలో డైలీ క్యాష్ బెనిఫిట్‌ను కూడా అందిస్తున్నాయి.
ప్రీ, పోస్ట్-హాస్పిటలైజేషన్ నియమ నిబంధనలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. నో-క్లెయిమ్ బోనస్, వెయిటింగ్ పీరియడ్ వంటి నిర్ణీత అంశాలపై కూడా తప్పనిసరిగా అగాహన పొందాలి

క్యుములేటివ్ బోనస్ అండ్ ప్రీమియం
క్యుములేటివ్ బోనస్ గురించి ప్రాస్పెక్టస్‌తో పాటు పాలసీ డాక్యుమెంట్‌లో ఉందనే అంశాన్ని ఆరోగ్య బీమా పాలసీ కొనుగోలు చేసే సమయంలోనే ధృవీకరించుకోవాలి. అలాగే కంపెనీ వెబ్‌సైట్‌లో కూడా ఆ ప్రొడక్ట్ సమచారాన్ని పొందవచ్చు. ఇందులో ప్రొడక్ట్ వివరాలతో పాటు, నిబంధనలు, ప్రీమియం రేట్లు, పాలసీలో వర్తింపులు-మినహాయింపులు, ఇతర పన్నుల వివరాలు కూడా ఉంటాయి. ఒక వ్యక్తి ఏదైనా సంవత్సరంలో క్లెయిమ్ చేసినట్లు అయితే, వ్యక్తిగత బీమా పథకంలో తర్వాతి రెన్యువల్ సమయంలో అదనపు ఛార్జీలను విధించడానికి వీలు లేదు.

 

ముందస్తు అనారోగ్యాలు
ఇన్సూరెన్స్ ప్రపోజల్ సంతకం పెడుతున్న సమయంలో అప్పటికే ఉన్న అనారోగ్యాలు-వ్యాధుల వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలి. అపుడు మీకు బీమా ఇవ్వాలా వద్దా అనే అంశాన్ని, ప్రీమియం మొత్తాన్ని బీమా కంపెనీ నిర్ణయించుకుంటుంది. సమాచారం దాచిపెట్టడం కానీ, తప్పుడు సమాచారం ఇవ్వడం కానీ ఎట్టి పరిస్థితులలోను చేయవద్దు. ఇలా చేస్తే క్లెయిమ్ సయమంలో తిరస్కరించేందుకు అవకాశం ఉంటుంది. గతంలో ఏదైనా తీవ్రవ్యాధులు సోకినట్లు అయితే అనేక కంపెనీలు బీమా ఇచ్చేందుకు ముందుకు రాకపోవచ్చు. ఒకవేళ ఇచ్చినా ప్రీమియం మొత్తం భఆరీగా ఉండవచ్చు.

 

వెయిటింగ్ పీరియడ్ & మినహాయింపులు
ముందుగా ఉన్న వ్యాధులకు దాదాపుగా అన్ని బీమా కంపెనీలు కొంత వెయిటింగ్ పీరియడ్‌ను నిర్ణయిస్తాయి. ఇది రెండు నుంచి నాలుగు సంవత్సరాల మధ్య ఉంటుంది. మీకు గతంలో ఏదైనా అనారోగ్యం ఉన్నట్లయితే, పాలసీ డాక్యుమెంట్‌పై సంతకం చేసేందుకు ముందే ఆయా సమాచారం ఇవ్వడంతో పాటు వెయిటింగ్ పీరియడ్ ఉన్నంతవరకూ క్లెయిమ్ చేసుకునే సదుపాయం ఉండదని గ్రహించండి. అందుకే వీలైనంత తక్కువ వయసులో ఆరోగ్య బీమా పాలసీ కొనుగోలు చేయడం ఉత్తమం. ఇలాంటి సమయంలో  ప్రీ-ఎగ్జిస్టింగ్ వ్యాధుల అవకాశం తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం వ్యక్తిగతంగా తీసుకునే బీమా పాలసీలను వెయిటింగ్ పీరియడ్ కవరేజ్‌తో సహా ఒక కంపెనీ నుంచి మరో బీమా కంపెనీకు మార్చుకునే అవకాశం ఉంది. 
 Most Popular