బుల్ రన్ మొదలైతే మల్టీబ్యాగర్స్‌గా మారే 8 స్టాక్స్

బుల్ రన్ మొదలైతే మల్టీబ్యాగర్స్‌గా మారే 8 స్టాక్స్


2017-18 ఆర్థిక సంవత్సరంలో బ్లూచిప్ కంపెనీలను.. బెంచ్ మార్క్ ఇండెక్స్‌లను మిడ్‌క్యాప్- స్మాల్ క్యాప్ షేర్లు ఔట్‌పెర్ఫామ్ చేశాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 16 శాతం ర్యాలీ చేసింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ గత ఏడాది కాలంలో 12 శాతం పెరిగింది.
ఫిబ్రవరి-మార్చ్ నెలల్లో కరెక్షన్ వచ్చినా.. గతేడాది మాదిరిగా ఈ ఏడాది మిడ్-స్మాల్ క్యాప్ విభాగాల్లో ర్యాలీ వచ్చే అవకాశాలు అంతగా లేవని మార్కెట్ ఎనలిస్ట్‌లు చెబుతున్నారు. 
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత.. మార్కెట్‌పై మళ్లీ బుల్స్ పట్టు బిగించే అవకాశాలు కనిపిస్తుండగా.. రాబోయే 2-3 సంవత్సరాలలో మల్టీబ్యాగర్స్‌గా మారే అవకాశాలు ఉన్న స్టాక్స్‌ జాబితాను ఓసారి పరిశీలిద్దాం.

 

కోటక్ సెక్యూరిటీస్
టాటా మోటార్స్: 
ఫారెక్స్ హెడ్జింగ్ తగ్గడంతో 2108-2020 ఆర్థిక సంవత్సరాల మధ్య టాటా మోటార్స్ కంపెనీ నికర లాభం రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది వర్కవుట్ అయితే ప్రస్తుతం 12-13 శాతంగా ఉన్న రిటర్న్ ఆన్ ఈక్విటీ.. 18-20 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ స్టాక్ 2020 పీఈకి 7 రెట్ల వద్ద చవకగానే లభిస్తోంది.

ఫెడరల్ బ్యాంక్:

ఎన్‌పీఏ సమస్యలు తీరిన తర్వాత.. రాబోయే రెండు మూడేళ్లలో ఈ బ్యాంక్ 25శాతం సీఏజీఆర్ చొప్పున ఎర్నింగ్స్ గ్రోత్ ప్రకటించే అవకాశం ఉంది. FY2020E బుక్ వాల్యూకు 1.1 రెట్ల వద్ద ఈ స్టాక్ చవగ్గా ట్రేడవుతోంది. పీక్ స్టేజ్‌లో 2 రెట్ల వద్ద ఈ స్టాక్ ట్రేడవడం కనిపించింది. వాల్యుయేషన్ బాగుడడం, ఫార్వార్డ్ ప్రైస్ /బుక్ వాల్యూ బాగుండడం ఈ స్టాక్‌కు సానుకూల అంశాలు.

జిందాల్ స్టెయిన్‌లెస్(హిసార్):
జీఎస్‌టీ అమలు తర్వాత చైనా దిగుమతులపై 18.95 శాతం కౌంటర్‌వైలింగ్ డ్యూటీ విధించడంతో.. జిందాల్ స్టెయిన్‌లెస్ హిసార్‌కు రాబోయే కాలంలో మార్కెట్ వాటా పెరగనుందని కోటక్ అంచనా వే్సతోంది. 15 శాతం సీఏజీఆర్‌‌తో ఆదాయం, 31 శాతం సీఏజీఆర్‌తో నికర లాభం వృద్ధి చెందే అకాశాలు ఉన్నాయి.

యూపీఎల్:

రాబోయే మూడేళ్ల పాటు 17-18 శాతం సీఏజీఆర్‌తో ఆదాయాలు పెరిగే అవకాశం ఈ కంపెనీకి ఉంది. ఆగ్రో-కెమికల్స్ స్పేస్‌లో డైవర్సిఫైడ్ వ్యాపారాలను యూపీఎల్ నిర్వహిస్తోంది. సెక్టార్ సగటు కంటే ఎక్కువకు ట్రేడ్ అయేందుకు తగిన అర్హతలు అన్నీ ఈ కంపెనీకి ఉన్నాయని కోటక్ నిపుణులు చెబుతున్నారు.


షేర్‌ఖాన్

జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్:

దేశీయ మార్కెట్‌లో వినియోగం పెరుగుతుండడంతో లబ్ధి పొందే స్టాక్స్‌లో ఇది ప్రధానమైనది. సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్‌లో రెండంకెల వృద్ధి సాధించడంపై కంపెనీ చాలా నమ్మకంగా ఉంది. ప్రొడక్ట్ ఇన్నోవేషన్, డిజిటలైజేషన్ సహకరిస్తాయని కంపెనీ చెబుతోంది.

సుందరం ఫాస్ట్‌నర్స్:

ఇంజిన్ కాంపొనెంట్స్, పంప్ అసెంబ్లీస్, పౌడర్ మెటల్, షాప్ట్స్ వంటి కొత్త ఉత్పాదనలను విజయవంతంగా లాంఛ్ చేయడం ద్వారా వాల్యూ చెయిన్‌ను పెంచుకుంటోంది సుందరం ఫాస్ట్నర్స్. ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యభరింతగా నిర్వహిస్తుండడంతో ఈ స్టాక్‌కు మంచి ఫ్యూచర్ ఉంది.

బజాజ్ ఫిన్‌సర్వ్:

లాంగ్ టెర్మ్ కోసం ఈ స్టాక్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఎకానమీలో సేవింగ్స్‌పై ఫైనాన్స్ చేస్తుండడం అనే థీమ్ ఈ స్టాక్‌కు సానుకూలంగా చెప్పవ్చుచ. బజాజ్ గ్రూప్‌నకు చెందిన లైఫ్ ఇన్సూరెన్స్ విభాగం బజాజ్ అలియాంజ్.. రుణ విభాగం బజాజ్ ఫైనాన్స్‌లకు ఇది హోల్డింగ్ కంపెనీ.


హెమ్ సెక్యూరిటీస్
ఐటీసీ:

2017-18 ఆర్థిక సంవత్సరం క్యూ3లో 17 శాతం పన్ను తర్వాతి లాభం గడించింది ఐటీసీ. దేశంలో ఎఫ్ఎంసీజీ మార్కెట్ 20.6 శాతం వేగంతో పెరగుతుండగా.. 2020 నాటికి 103.7 బిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకోనుంది. 2016లో ఇది 49 బిలియన్ డాలర్లు మాత్రమే. 
 Most Popular