తక్కువ రిస్క్‌తో మంచి డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ ?

తక్కువ రిస్క్‌తో మంచి డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ ?

ఈక్విటీ మార్కెట్లు కరెక్షన్‌కు గురైనా స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. గత ఐదేళ్లలో సెన్సెక్స్ 11.8 శాతం సీఏజీఆర్‌ తో రాబడులను అందించింది. అయినా సరే డివిడెండ్‌ను ఇన్వెస్టర్లు చిన్నచూపు చూడడం సరికాదు. ఇదే సమయంలో డివిడెండ్స్‌ను తిరిగి ఇన్వెస్ట్ చేస్తే.. 13.3 శాతం సీఏజీఆర్ సాధ్యం అయేది. అంటే 20 ఏళ్ల క్రితం రూ. 100 ఇన్వెస్ట్ చేసినట్లయితే.. సెన్సెక్స్ రిటర్న్‌ల ప్రకారం అధి రూ. 822 అవుతుంది. కానీ రీ-ఇన్వెస్ట్‌మెంట్స్ డివిడెండ్స్‌ను కూడా కలుపుకుంటే ఇది రూ. 1152కు చేరుకుంటుంది.


చక్కని డివిడెండ్ ఈల్డ్స్.. ఎక్కువ డివిడెండ్ పేఅవుట్స్ ఇచ్చే స్టాక్స్‌ను పరిశీలించాలి. ప్రస్తుతం మన ఎకానమీలో ఫిక్సెడ్ డిపాజిట్లకు 6-7 శాతం వడ్డీ మాత్రమే లభిస్తోంది. ఇలాంటి సమయంలో స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచి వ్యూహమే అవుతుంది. పైగా బ్యాంక్ ఫిక్సెడ్ డిపాజిట్లపై పన్ను భారం ఉంటుంది. కానీ డివిడెండ్స్ ద్వారా అందుకునే మొత్తం రూ. 10 లక్షలు దాటితేనే పన్ను ఉంటుంది. అందుకే హై డివిడెండ్ ఈల్డ్ ఉన్న స్టాక్స్‌లో పెట్టుబడులు చేయడాన్ని విశ్లేషకులు ప్రోత్సహిస్తారు. రెగ్యులర్‌గా డివిడెండ్ ఇచ్చే కంపెనీలను పరిశీలించాల్సిందిగా సూచిస్తారు. 
ఎక్కువ డివిడెండ్ ఈల్డ్ ఉన్న 10 స్టాక్స్‌ను జాబితాను కార్వీ స్టాక్ బ్రోకింగ్ రూపొందించింది. సెక్టార్ ఆధారితం కాకుండా బీఎస్ఈ500 జాబితాకు దగ్గరగా ఉండేలా ఈ లిస్ట్‌ను తయారు చేశామని కార్వీ వెల్లడించింది. 

 

క్యాస్ట్రాల్ ఇండియా
దేశంలో ఇంజిన్ ఆయిల్ లూబ్రికెంట్స్ తయారీలో ఉన్న బడా కంపెనీల్లో ఒకటి క్యాస్ట్రాల్ ఇండియా లిమిటెడ్. సిల్వసా, పాతాళగంగ, పహార్‌పూర్‌లలో మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉండగా.. రిటైల్ ఔట్‌లెట్స్ రూపంలోను, 420 మంది డిస్ట్రిబ్యూటర్లతో స్ట్రాంగ్ నెట్వర్కింగ్ కలిగి ఉంది. 
ప్రధాన బ్రాండ్లు:  క్యాస్ట్రాల్ ఎడ్జ్, క్యాస్ట్రాల్ మాగ్నెటిక్, క్యాస్ట్రాల్ జీటీఎక్స్, క్యాస్ట్రాల్ పవర్1, క్యాస్ట్రాల్ యాక్టివ్, క్యాస్ట్రాల్ సీఆర్‌బీ.. 

గ్రీవ్స్ కాటన్
మెషీనరీ, ఎక్విప్‌మెంట్ తయారీ రంగంలో ఉన్న గ్రీవ్స్ కాటన్.. తన వ్యాపారాలను డైవర్సిఫైడ్‌గా నిర్వహిస్తోంది. ఆటో ఇంజిన్స్, ఆక్సిలరీ పవర్ సొల్యూషన్స్, ఫామ్ ఎక్విప్‌మెంట్ బిజినెస్, ఆఫ్టర్-మార్కెట్ బిజినెస్‌లను ఈ కంపెనీ నిర్వహిస్తోంది. మొత్తం 6 తయారీ ప్లాంట్లు ఉండగా, 3500లకు పైగా టచ్ పాయింట్స్‌తో కస్టమర్లకు సేవలు అందిస్తోంది.

హీరో మోటో కార్ప్.
దేశీయ టూ వీలర్ మార్కెట్‌లో అగ్రగామి హీరో మోటో కార్ప్. ఈ సెగ్మెంట్‌లో 51శాతం వాటాను కంపెనీ కలిగి ఉంది. 75సీసీ నుంచి 150సీసీ వరకు మోటార్ సైకిల్స్.. 100 నుంచి 125సీసీ వరకు స్కూటర్లను కంపెనీ విక్రయిస్తోంది. 13.8శాతం అమ్మకాల వృద్ధి నమోదు చేసిన ఈ కంపెనీ మొత్తం 75.8 లక్షల విక్రయాలను గతేడాది చేయగలిగింది.

 

హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్
ఫార్చూన్ 500 కంపెనీలలో ఒకటి అయిన హెచ్‌పీసీఎల్.. ఆయిల్ రిఫైనింగ్, మార్కెటింగ్ విభాగాల్లో సేవలు అందిస్తోంది. నవరత్న కంపెనీలలో ఒకటి అయిన క్రూడాయిల్ రిఫైన్ చేయడం.. పెట్రోలియం, పెట్రోలియం ప్రొడక్టులను రూపొందిస్తోంది. దేశవ్యాప్తంగా విక్రయాలు చేస్తుండగా లూబ్ ప్రొడక్ట్స్, లూబ్రికేటింగ్ ఆయిల్, ఏవియేషన్ ఫ్యుయల్, హైడ్రాలిక్ బ్రేక్ ఫ్లూయిడ్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, ఇన్‌సెక్టిసైడ్స్‌ను ఈ కంపెనీ మార్కెట్ చేస్తోంది.

ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్
దేశంలో లీడింగ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఒకటి. తాజాగా ఈ కంపెనీ ఈ-హోమ్ లోన్స్‌ను లాంఛ్ చేసింది. దేశంలోనే ఈ విధానం సరికొత్తది కావడం విశేషం. కేర్ నుంచి ఏఏఏ రేటింగ్‌ను, క్రిసిల్‌ నుంచి ఏఏ+ రేటింగ్‌ను ఐబీ హౌసింగ్ కలిగి ఉంది. 

ఇన్ఫోసిస్
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సర్వీసుల సంస్థ ఇన్ఫోసిస్. 2017 ఆర్థిక సంవత్సరంలో 10.7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని గడించింది. ఐటీ, బీపీఓ రంగాల్లో ఎండ్-ఎండ్ సర్వీసులను ఇన్ఫోసిస్ అందిస్తోంది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, మెయింటెనెన్స్, టెక్నాలజీ, మేనేజ్మెంట్ కన్సల్టింగ్, టెస్టింగ్, సిస్టం ఇంటిగ్రేషన్, ఇంజినీరింగ్ సర్వీసులు, బీపీఏ, ప్యాకేజ్ ఇంప్లిమెంటేషన్ వంటి సేవలను నిర్వహిస్తోంది. 

కర్నాటక బ్యాంక్
ప్రాంతీయంగా ఫోకస్ చేసిన ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులలో కర్నాటక బ్యాంక్ ఒకటి. ప్రధానంగా కర్నాటక రాష్ట్రంలో కార్యలాపాలను ప్రధానంగా నిర్వహిస్తోంది. 1924లో మంగళూర్‌లో ప్రారంభమైన ఈ కంపెనీ.. శృంగేరి శారదా బ్యాంక్, చింతల్‌దుర్గ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ కర్నాటకలను విలీనం చేసుకుంది. 

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్
నవరత్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్.. విద్యుత్ ఆధారిత కంపెనీ, విద్యుత్ ఉత్పత్తి రంగంలోని కంపెనీలకు రుణాలను అందిస్తోంది. ఫండ్ ఆధారిత, నాన్ ఫండ్ ఆధారిత ఫైనాన్షియల్ అసిస్టెన్స్‌తో పాటు కన్సల్టెన్సీ సర్వీసులను కూడా ఈ కంపెనీ అందిస్తోంది. 

పీటీసీ ఇండియా
దేశఁలో అతి పెద్ద పవర్ ట్రేడింగ్ కంపెనీ అయిన పీటీసీ ఇండియాకు.. మొత్తం మార్కెట్‌లో 40 శాతం వాటా ఉంది. కంపెనీ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ 327 బిలియన్ యూనిట్స్ పవర్‌ను ట్రేడ్ చేసింది. 16.7 బిలియన్ యూఎస్ డాలర్ల ఆదాయం గడించగా.. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలతో క్రాస్-బోర్డర్ ట్రేడింగ్ కూడా ఈ కంపెనీ నిర్వహిస్తోంది.

వీఎస్‌టీ ఇండస్ట్రీస్
బ్రిటిష్ అమెరికన్ టుబాకోకు చెందిన అనుబంధ సంస్థ వీఎస్‌టీ ఇండస్ట్రీస్. హైద్రాబాద్ కేంద్రంగా సిగరెట్ తయారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ 1930లో ప్రారంభమైంది. దేశీయ సిగరెట్ల మార్కెట్‌లో 3వ స్థానంలో ఉన్న ఈ కంపెనీకి 8 శాతం మార్కెట్ వాటా ఉంది. 
ప్రధాన బ్రాండ్స్: చార్మినార్, చార్మినార్ స్పెషల్ ఫిల్టర్, చార్మ్స్ మిని కింగ్స్, చార్మ్స్ వర్జీనియా ఫిల్టర్, ఎక్స్ఎల్ ఫిల్టర్, విజయ్, షాన్ వంటివి.

 

డివిడెండ్ స్టాక్స్‌పై కార్వీ రిపోర్ట్ కోసం క్లిక్ చేయండిMost Popular