వాళ్లతో ఫ్రెండ్‌షిప్ చేస్తే.. స్టాక్ మార్కెట్‌లో సంపాదించవచ్చు? 

వాళ్లతో ఫ్రెండ్‌షిప్ చేస్తే.. స్టాక్ మార్కెట్‌లో సంపాదించవచ్చు? 

దేశంలో వినియోగం విపరీతంగా పెరిగిపోతూనే ఉంది. ఇందుకు ప్రధాన కారణం ఎవరో తెలుసా.. మిలీనియల్స్. అదేనండీ మిలీనియం ఇయర్ నాటికి యంగ్ అడల్ట్స్ అన్న మాట. ఇంకా స్పష్టంగా తెలియాలంటే ప్రస్తుతం 18-35 సంవత్సరాల ఏజ్ గ్రూప్‌లో ఉన్నవారిని మిలీనియల్స్‌ అని.. జనరేషన్ వై అని వ్యవహరించడం పరిపాటి.
మన దేశంలో 45 కోట్ల మంది మిలీనియల్స్ ఉన్నారు. అంటే మన దేశ జనాభాలో 35శాతం వారే అన్న మాట. వారి లైఫ్ స్టైల్‌ను, వినియోగ అలవాట్లను బేస్ చేసుకుని.. పోర్ట్‌ఫోలియో నిర్మించుకుంటే.. లాభాలను భేషుగ్గా ఒడిసిపట్టేయచ్చు.
తరచుగా రెస్టారెంట్స్‌కు వెళ్లడం, ఎక్కువగా ప్రయాణాలు చేయడం, ఫ్రెండ్స్‌తోను లేదా ఆన్‌లైన్‌ సహచరులతో కలిసి ఔటింగ్‌కు వెళ్లడం, ఈ కామర్స్ సైట్స్‌లో మాంచి ఆఫర్స్‌ కోసం వెతకడం, స్టార్టప్ ఐడియాల గురించి మథనపడడం, వీడియో బ్లాగ్స్ క్రియేడం వంటివి.. మిలీనియల్స్‌ చర్యలకు కొన్ని ఉదాహరణలుగా చెప్పవచ్చు.

 

మారుతున్న వినియోగ రంగం

మార్పునకు సంబంధించిన అంశాలు ఇప్పటికే రెపరెపలాడుతున్నాయి. దేశీయ వినియోగ రంగ తీరుతెన్నులు మారిపోతున్నాయి. వర్కింగ్ ఏజ్ జనాభా సంఖ్య ఏకంగా 47 శాతానికి పెరగడం సానుకూలంగా చెప్పవచ్చు. అయితే.. గతంతో పోల్చితే పొదుపు శాతం తగ్గిందని.. కానీ ఖర్చు చేసే అమౌంట్ బాగా పెరిగిందని నిపుణులు అంటున్నారు.
బడా కార్పొరేట్ కంపెనీలు జనాల ఈ స్పెండింగ్ హ్యాబిట్‌ను క్యాష్ చేసుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలను అనసురిస్తున్నారు. మిలినియల్స్‌ను ఆకర్షించే ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను రూపొందిస్తూనే ఉన్నారు. 

అంతర్జాతీయంగా మొత్తం 740 కోట్ల జనాభాలో మిలినియల్స్ సంఖ్య 27 శాతం(190 కోట్లు) ఉంటుంది. కానీ ఇండియాలో మాత్రం ఇది 35 శాతం పైగానే అనే విషయం గుర్తుంచుకోవాలి. అంతర్జాతీయ సగటుతో పోల్చితే మన దగ్గర జనరేషన్ వై జనాలు బాగా ఎక్కువగా ఉన్నారు.

అందుకే ఎఫ్ఎంసీజీ, ఈ-కామర్స్, స్మార్ట్‌ఫోన్ మేకర్స్, ఆటోమొబైల్, టెలికాం, ఎడ్యుకేషన్, సేవా రంగాలకు చెందిన వ్యాపారాలను ఇక్కడ విపరీతంగా ప్రారంభించేస్తూ ఉంటారు. కొత్త తరం వినియోగదారులు ఈ సెగ్మెంట్స్‌పైనే ఎక్కువగా దృష్టి నిలపడమే ఇందుకు కారణం.

 

డిజిటల్ సెగ్మెంట్

“ప్రామాణిక ఆర్థిక విభాగంలోకి మిలీనియల్స్ వచ్చి చేరుతున్నారు. అందుకే డిజిటల్ రంగం ర్యాపిడ్‌గా వృద్ధి సాధిస్తోంది,” అని ఐఐఎఫ్ఎల్ చెబుతోంది. టీవీలను చూడడం లేదా ఆన్‌లైన్‌లో గడపడం వంటి అంశాలపై మిలీనియల్స్ సగటున రోజుకు 162 నిమిషాలను వెచ్చిస్తున్నారు. ఇందులో సోషల్ మీడియా వెబ్‌సైట్స్.. ఎంటర్టెయిన్మెంట్.. షాపింగ్ వంటి అన్ని అంశాలు ఉంటాయి. కేవలం వీడియోలను చూసేందుకే రోజుకు 20 నిమిషాల సమయాన్ని వెచ్చిస్తున్నారని ఎలారా సెక్యూరిటీస్ అంటోంది.
స్మార్ట్‌ఫోన్ వినియోగం మన దేశంలో ఇంకా పెరగనుంది. 2017 చివరకు 35 కోట్లుగా ఉన్న వినియోగం.. 2020 నాటికి ఇది 50.1 కోట్లను అందుకోనుంది.
“ఎఫ్ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో ఈ కామర్స్ వాటా 1-2 శాతం ఉండగా.. హిందుస్తాన్ యునిలీవర్ వాటా 1 శాతంగా ఉంది,” అని ఎలారా సెక్యూరిటీస్ అంటోంది.

 

ఫుడ్ అండ్ ఫిట్‌నెస్

ప్యాకేజ్డ్ ఫుడ్ వినియోగం కూడా రానున్న కాలంలో మరింతగా పెరగనుంది. మిలీనియల్స్ ఈ విభాగంపై బాగా మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా ఈ-కామర్స్ సెగ్మెంట్‌లో ఈ వ్యాపారం గణనీయంగా పెరుగుతూనే ఉంది.
ఫిట్‌గా ఉండడంపై కూడా మిలీనియల్స్ దృష్టి ఎక్కువగానే ఉంది. ప్రతీ 10 మందిలో 4గురు అమ్మాయిలు ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండడం కోసం భోజనం స్కిప్ చేస్తూ ఉంటారు. అందుకే ఓట్స్, ఆర్గానిక్ మిల్క్, హెర్బల్, గ్రీన్ టీ, ఫ్రెష్ వెజిటలబుల్స్. ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూస్‌ల సెగ్మెంట్‌లకు డిమాండ్ పెరగడానికి ఫిట్‌నెస్ కారణంగా నిలుస్తోంది.
నెస్ట్‌లే, హిందుస్తాన్ యూనిలీవర్, మారికో వంటి కంపెనీలు మిలీనియల్స్‌ను టార్గెట్ చేసి ప్రొడక్ట్‌లను రిలీజ్ చేస్తున్నాయి.
హెల్త్ సప్లిమెంట్స్, గాడ్జెట్స్, అప్పెరల్, కాస్మెటిక్ అండ్ గ్రూమింగ్ ప్రొడక్ట్స్, ఎఫ్ఎంసీజీ, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్, రెడీమేడ్ గార్మెంట్స్, మోటార్ సైకిల్స్‌కు సంబంధించిన కంపెనీలు రానున్న కాలంలో బాగా పెర్ఫామ్ చేస్తాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. Most Popular