కరెక్షన్‌లో కొనేందుకు అనుకూలంగా ఉన్న 7 స్టాక్స్

కరెక్షన్‌లో కొనేందుకు అనుకూలంగా ఉన్న 7 స్టాక్స్

లాంగ్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను విధింపు.. ప్రభుత్వ రంగ బ్యాంకులలో స్కామ్స్. ప్రైవేటు బ్యాంకుల పైనా వెలువడుతున్న అనుమానాలు వంటి కారణాలు.. బడ్జెట్ తర్వాత మార్కెట్‌లలో కరెక్షన్‌కు కారణం అయ్యాయి. అమెరికా వడ్డీ రేట్లు, అంతర్జాతీయంగా నెలకొన్న ట్రేడ్‌ వార్ వంటి పరిస్థితులు కూడా ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు.
లైఫ్ టైం హై లెవెల్స్‌ నుంచి ఇండెక్స్‌లు 8 శాతం మేర దిగి వచ్చాయి. పలు లార్జ్ క్యాప్ కంపెనీలు అంతకంటే ఎక్కువగానే కరెక్షన్‌కు గురయ్యాయి. వీటిలో 8 స్టాక్స్ అయితే భారీగా కరెక్షన్‌కు గురయ్యి.. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్‌కి బాగా అట్రాక్టివ్‌గా కనిపిస్తున్నాయి.

 

అర్వింద్
అర్వింద్ ప్రతిపాదించిన డీమెర్జర్ ప్రణాళిక కారణంగా టెక్స్‌టైల్ వ్యాపారంవైపు కచ్చితంగా ఫోకస్ పెట్టాల్సిందే. అర్వింద్ టెక్స్‌టైల్ బిజినెస్ నుంచి వచ్చిన నగదును గతంలో బ్రాండ్స్ అండ్ రిటైల్ మీద వెచ్చించేవారు. ఇప్పుడు డీమెర్జర్ తర్వాత టెక్స్‌టైల్స్ క్యాష్ ఫ్లోను అభివృద్ధి కోసం వెచ్చించనున్నారు.

 

అదాని పోర్ట్స్ & సెజ్
దేశంలో అతి పెద్ద పోర్ట్ ఆపరేటర్ అదాని పోర్ట్స్ అండ్ సెజ్. ఇప్పటికే పలు ప్రాంతాలలో సేవల ప్రారంభించడంతో పాటు ఫస్ట్-మూవర్ అడ్వాంటేజ్ కూడా ఉంది. తూర్పు, పశ్చిమ తీరాల్లో పలు పోర్ట్‌లను నిర్వహిస్తున్న ఈ కంపెనీ.. రవాణాతో పాటు పలు సేవలను అందిస్తోంది.

 

భారత్ ఎలక్ట్రానిక్స్(BEL)
కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాకు ప్రోత్సాహం అందిస్తుండడంతో మన దేశంలో డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇప్పుడు ఊపందుకుంది. ఈ సెక్టార్‌లో ఎఫ్‌డీఐ పరిమితిని 26 నుంచి 49 శాతానికి పెంచారు. స్థానికంగా ఎక్విప్‌మెంట్ సేకరణు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు లైసెన్సింగ్ విధానం కూడా సులభతరం చేశారు.

 

ఇమామి
కేష్ కింగ్ కొనుగోలు చేయడం, డీమానిటైజేషన్ కారణంగా హోల్‌సేల్ ఛానల్‌కు సవాళ్లు ఎదురుకావడం, క్యాంటీన్ స్టోర్ డిపార్ట్‌మెంట్ ఛానల్‌పై జీఎస్‌టీ ప్రభావం పడడం వంటివి ఇమామికి కొంతకాలంగా ఇబ్బందులుగా పరిణమించాయి. నవరత్న, బోరోప్లస్, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్, జండు.. ఈ నాలుగు సెగ్మెంట్స్‌లో ఇమామికి స్ట్రాంగ్ ప్రెజన్స్ ఉంది. మొత్తం కంపెనీ అమ్మకాల్లో వీటి వాటానే 60 శాతం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో ఈ కంపెనీకి మార్కెట్ ఎక్కువ.

 

ఇండియన్ హోటల్స్
ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేషియో 64 శాతంగా ఉండగా.. దేశీయ హాస్పిటాలిటీ పరిశ్రమలో ఇండియన్ హోటల్స్‌కు 20 శాతం వాటా ఉంది. అస్సెట్ లైట్ మోడల్‌ను అనుసరించడం.. ఫ్యూచర్ పెర్ఫామెన్స్‌పై దృష్టి నిలపడం వంటివి ఈ కంపెనీకి సానుకూలంగా చెప్పవచ్చు. ఎనర్జీ కాస్ట్.. పేరోల్ కాస్ట్ తగ్గించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది ఈ కంపెనీ.

 

మదర్సన్ సుమి
గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఆశించిన ఫలితాలను ప్రకటించలేకపోయింది మదర్సన్ సుమి. ఎస్ఎంఆర్, ఎస్ఎంపి, పికెసి వంటి విభాగాలు ఒత్తిడిలో ఉన్నాయి. అయితే ఇతర సెగ్మెంట్స్ మాత్రం 15-27 శాతం రెవెన్యూ గ్రోత్ సాధించాయి. గతేడాది పెర్ఫామ్ చేయలేకపోయిన సెగ్మెంట్స్ కూడా ఈ సారి ప్రదర్శించే అవకాశం ఉండడంతో.. లాభదాయకత పెరిగే అవకాశం ఉంది.

 

టాటా గ్లోబల్ బెవరేజెస్
విభిన్న సెగ్మెంట్స్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీ టాటా గ్లోబల్ బెవరేజెస్. టర్న్అరౌండ్ తీసుకుంటున్న/నష్టాలను ఆర్జిస్తున్న కంపెనీలను విక్రయించడంలో టాటా గ్రూప్ టాప్ మేనేజ్‌మెంట్ ఫోకస్ పెట్టింది. అలాగే కొత్త అభివృద్ధి అవకాశాలను వెతికిపట్టుకోవడంలో ఈ కంపెనీ వర్గాలు ట్యాలెంట్ చూపుతోన్నాయి.

 

పెట్రోనెట్ ఎల్ఎన్‌జీ
ఎల్ఎన్‌జీ టెర్మినల్ బిజినెస్(జీఎస్‌పీసీ)లోకి అదాని ఎంట్రీ ఇస్తుండడం, ముంద్రా ప్రాంతంలో 5ఎంటీ ఎల్ఎన్‌జీ టెర్మినల్‌ను అదాని ఎంటర్‌ప్రైజెస్‌ను కో-డెవలప్ చేస్తుండడం వంటివి.. పెట్రోనెట్‌కు ప్రమాదంగా పరిణమించడంతో రీసెంట్‌గా ఈ స్టాక్ భారీ కరెక్షన్‌కు గురయింది. ప్రస్తుతం ఉన్న వాల్యుయేషన్‌లో ఈ స్టాక్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. నిలకడ కలిగిన వ్యాపారం కావడంతో.. ఈ లెవెల్‌లో కొనుగోలు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.Most Popular