మిశ్రధాతు నిగమ్‌ లిస్టింగ్‌ ఫర్వాలేదు!

మిశ్రధాతు నిగమ్‌ లిస్టింగ్‌ ఫర్వాలేదు!

గత నెలలో పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థ మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌(మిధానీ) స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో నామమాత్ర నష్టంతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 90 కాగా.. బీఎస్ఈలో రూ. 3 నష్టంతో(3.3 శాతం) నష్టంతో రూ. 87 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం రూ. 89 వద్ద ట్రేడవుతోంది. ఇష్యూ ద్వారా ప్రభుత్వం రూ. 438 కోట్లను సమీకరించింది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 4.87 కోట్ల షేర్లను(26 శాతం వాటా) విక్రయించింది. అయితే ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి అంతంత మాత్ర  స్పందనే లభించింది. ఐపీవోకి 1.2 రెట్లు మాత్రమే సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. 
కంపెనీ నేపథ్యం 
1973లో హైదరాబాద్‌ కేంద్రంగా ప్రారంభమైన మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌(మిధాని) స్పెషల్‌ స్టీల్స్‌, సూపర్‌ అల్లాయ్స్‌ తయారీతోపాటు దేశీయంగా టైటానియం అల్లాయ్స్‌ తయారు చేసే ఏకైక కంపెనీ కావడం గమనార్హం. రక్షణ, అంతరిక్ష, విద్యుత్‌ రంగాల్లోని కంపెనీలకు అవసర ఉత్పత్తులను, మిశ్రధాతువులను తయారు చేస్తోంది. హైదరాబాద్‌లో తయారీ కేంద్రాన్ని కలిగివున్న ఈ సంస్థ.. రోహ్‌తక్‌, నెల్లూరులలో రూ.100 కోట్ల పెట్టుబడితో కొత్త ప్లాంట్లను నిర్మిస్తోంది.Most Popular