భారీ నష్టాలతో ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ లిస్టింగ్‌!

భారీ నష్టాలతో ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ లిస్టింగ్‌!

ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన బ్రోకింగ్‌ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ స్టాక్ ఎక్స్ఛేంజీలలో భారీ నష్టాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 520కాగా.. బీఎస్‌ఈలో రూ. 431 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఇది 17 శాతం(రూ. 89) నష్టంకాగా.. ప్రస్తుతం 13 శాతం తక్కువగా రూ. 453 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఇష్యూకి 78 శాతమే సబ్‌స్క్రిప్షన్ లభించింది. యాంకర్‌ విభాగంతో కలుపుకుంటే ఇష్యూ 88 శాతం సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. యాంకర్‌ పోర్షన్‌తో కలిపి ఇష్యూ ద్వారా ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ రూ. 3500 కోట్లను సమీకరించింది. వెరసి ఇష్యూ పరిణామాన్ని రూ. 4017 కోట్ల నుంచి రూ. 3500కు తగ్గించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. 
బిడ్స్‌ తీరిదీ
ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఐపీవోకు సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం నుంచి పూర్తిస్థాయిలో(1 శాతం) బిడ్స్‌ దాఖలుకాగా..  సంపన్న వర్గాల కోటాలో స్వల్పంగా 33 శాతమే స్పందన కనిపించింది. ఇక రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి సైతం 88 శాతం దరఖాస్తులు లభించాయి. కంపెనీ 4.42 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 3.46 కోట్ల షేర్ల కోసం మాత్రమే బిడ్స్‌ దాఖలయ్యాయి. యాంకర్‌ ఇన్వెస్టర్ల విభాగంలో 3.3 కోట్ల షేర్లను 28 సంస్థలకు కేటాయించింది. షేరుకి రూ. 520 ధరలో  వీటిని జారీ చేయడం ద్వారా రూ. 1717 కోట్లను సమీకరించింది. Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');