ఎక్కువ రిస్క్ లేకుండా కోటి కూడబెట్టాలా? పోర్ట్‌ఫోలియో ఇలా ఉంటే సాధ్యమే!

ఎక్కువ రిస్క్ లేకుండా కోటి కూడబెట్టాలా? పోర్ట్‌ఫోలియో ఇలా ఉంటే సాధ్యమే!

2018 ప్రారంభంలోనే దేశీయ మార్కెట్లు కొత్త గరిష్టాలను నమోదు చేశాయి. ఆ మూమెంటం ప్రస్తుతం కోల్పోయి.. హైయర్ లెవెల్స్‌ నుంచి 11 శాతం మేర సూచీలు దిగివచ్చాయి. అయినా సరే ఈ సమయంలో కొన్ని స్టాక్స్ మల్టీబ్యాగర్స్‌గా అవతరించాయి.
అయితే ఈక్విటీ మార్కెట్లు ఇప్పుడు రూటు ఎటు తీసుకుంటాయి అనే విషయంపై స్పష్టమైన అంచనాలు వెలువడడం లేదు. లాంగ్ టెర్మ్‌కు మన మార్కెట్లపై సానుకూలంగానే ఉన్నా.. షార్ట్ టెర్మ్‌లో మాత్రం బేర్ గ్రిప్ కొనసాగవచ్చని అంటున్నారు. 
మార్కెట్లు పయనం ఎటు ఉన్నా.. ఇతర పెట్టుబడి సాధనాలతో పోల్చితే ఈక్విటీ పెట్టుబడులు కచ్చితంగా అధికంగా ఉంటాయి. అందుకే వీటిని ఏ మాత్రం విస్మరించరాదని మార్కెట్ వర్గాలు చెబుతాయి.

 

ఏజ్ గ్రూప్ ముఖ్యం

తగ్గినపుడల్లా కొనుగోలు చేయడం అనే వ్యూహం కచ్చితంగా సత్ఫలితాలను అందిస్తుంది. అలాగే పలు విభాగాలను చెందిన మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవడం ద్వారా సంపద సృష్టి చేపట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మీరు 35-40 ఏజ్ గ్రూప్‌లో ఉన్నట్లయితే.. ఓ పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవడం.. అది డైరెక్ట్ ఈక్విటీల మాదిరిగా మరీ రిస్కీగా ఉండకుండా జాగ్రత్తపడాలి. 
లాంగ్ టెర్మ్ కోసం ఆర్థిక లక్ష్యాలు గల మదుపర్లు.. ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి అవకాశాలను పరిశీలించాలి. మీరు తగినంతగా హోమ్ వర్క్ చేసి ఆయా షేర్లపై నిర్ణయం తీసుకోలేని సమయంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీకు కచ్చితంగా అక్కరకు వస్తాయి.
35-40 ఏజ్ గ్రూప్‌లోని వ్యక్తులు తమ పోర్ట్‌ఫోలియోను ఈ విధంగా నిర్మించుకోవచ్చు.

 

2018-19 ఆర్థిక సంవత్సరానికి ఐడియల్ పోర్ట్‌ఫోలియో

  • మల్టిక్యాప్ ఫండ్స్ - 30 శాతం
  • లార్జ్ క్యాప్ ఫండ్స్ - 25 శాతం
  • షార్ట్ టెర్మ్ డెట్ ఫండ్స్ - 20 శాతం
  • మిడ్ క్యాప్ ఫండ్స్ - 15
  • లిక్విడ్ ఫండ్స్ - 10 శాతం

నిలకడ గల పోర్ట్‌ఫోలియో నిర్మాణానికి అసెట్ అలాకేషన్ చాలా ముఖ్యమైన అంశం. కాలంతో పాటు ఇన్వెస్టర్ అవసరాలకు అనుగుణంగా ఇది మారుతూ ఉంటుంది. 30-50 ఏళ్ల మధ్యలో ఉన్నంత కాలం ఈక్విటీలలో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం సరైన బెట్‌గా పరిగణించవచ్చు.
ఈక్విటీ మార్కెట్లలో ఇది సరైన సమయం అని నిర్ణయించడం చాలా క్లిష్టమైన విషయం. కానీ అనుభవజ్ఞులు అయిన ఫండ్ మేనేజర్లు నిర్వహించే మ్యూచువల్ ఫండ్ రూట్‌ను ఎంచుకోవడం.. సిప్ మార్గంలో పెట్టుబడులు చేయడం ద్వారా అన్ని సమయాలను అనుకూలంగా మార్చుకోవచ్చు.

 

ఎవరెంత
అంతగా అప్పులు లేని ఓ యంగ్ పర్సన్ తన పెట్టుబడులలో 60 శాతం ఈక్విటీలపై ఇన్వెస్ట్ చేయవచ్చు. లాంగ్ టెర్మ్ కోసం పెట్టుబడులు చేస్తున్నపుడు సరైన సమయం ఇదీ అని ప్రత్యేకించి నిర్ణయించడానికి ఏమీ ఉండదనని వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసుల నిర్వాహకులు చెబుతున్నారు. 

ఈక్విటీ మార్కెట్లలో అడుగు పెట్టేందుకు భయపడాల్సిన అవసరం లేదని.. 2019 ఫైనాన్షియల్ ఇయర్ కోసం నిపుణులు చెబుతున్న ఈ కింది సలహాలను పాటించవచ్చని మార్కెట్ ఎనలిస్టులు చెబుతున్నారు. 

 

జగన్నాధం టి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ రీసెర్చ్ హెడ్, సెంట్రమ్ బ్రోకింగ్.
50-60 శాతం లార్జ్ క్యాప్స్‌లో, 20-40 శాతం మిడ్ అండ స్మాల్‌క్యాప్స్‌లోను, 10-20శాతం థీమ్ బేస్డ్ స్టాక్స్‌లోను పెట్టుబడులు చేయాలి. 

 

ప్రసన్న పాఠక్, ఫండ్ మేనేజర్, టారస్ మ్యూచువల్ ఫండ్
పొదుపు మొత్తాన్ని ఆదాయానికి అనుగుణంగా పెంచుకుంటూ.. 30-40 శాతం మొత్తాన్ని బ్యాంక్ ఎఫ్‌డీలు, లిక్విడ్, ఆర్బిట్రేజ్ స్కీమ్‌లలో పెట్టుబడి చేసి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. 20-30 శాతం పెట్టుబడికి ఓ మోస్తరు భద్రత ఉండే ఇన్‌కం స్కీమ్స్, బ్యాలెన్స్‌డ్ స్కీమ్స్, గోల్డ్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి.
మిగిలిన భాగాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లోని ఈక్విటీ స్కీమ్‌(లార్జ్ క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్, డైవర్సిఫైడ్)లలో ఇన్వెస్ట్ చేయాలి. ఆయా వ్యక్తుల రిస్క్ భరించే సామర్ధ్యం, ఆదాయ స్థాయి, అప్పులు, అప్పటికే ఉన్న కమిట్‌మెంట్స్ ఆధారంగా నిర్ణయించుకోవాలి. అసెట్ అలాకేషన్‌పై తగిన నిర్ణయం కోసం సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదించాలి.

 

దీపన్ మెహతా, డైరెక్టర్, ఎలిక్సిర్ ఈక్విటీస్
పోర్ట్‌ఫోలియోలో 30-35 వాటాను బ్యాంక్స్/ఎన్‌బీఎఫ్‌సీలు(ప్రైవేట్ సెక్టార్- రిటైల్ ఫోకస్), 30-365 శాతం కస్టమర్ సంబంధిత స్టాక్స్(ఆటో, రిటైల్, ఏవియేషన్, ఎంటర్టెయిన్మెంట్, బిల్డింగ్ మెటీరియల్, అప్లయెన్సెస్), 15 శాతం క్యాపిటల్ గూడ్స్/ఈపీసీ కంపెనీలు, 5 శాతం ఎగుమతుల రంగానికి చెందిన కంపెనీలలో పెట్టుబడి చేయాలి. 10 శాతం ఎప్పుడూ క్యాష్ రూపంలో చేతిలో ఉంచుకోవడం ద్వారా.. వోలటైల్ పరిస్థితులను ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. Most Popular