గేమింగ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో దూసుకెళుతోన్న స్మాష్

గేమింగ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో దూసుకెళుతోన్న స్మాష్గేమింగ్‌ సెంటర్‌ చైన్‌ను నిర్వహిస్తున్న స్మాష్‌ గేమింగ్‌ సెంటర్‌ ఇనార్బిట్‌ మాల్‌లో నూతన విభాగాన్ని ప్రారంభించింది. హైదరాబాద్ లో ఫస్ట్ టైం 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ట్రాంపోలైన్ పార్క్ ను మొదటి వార్షికోత్పవం సందర్భంగా లాంఛ్ చేసినట్లు స్మాష్ తెలిపింది. దేశవ్యాప్తంగా తమకు 5 గేమింగ్ సెంటర్లున్నాయని, ఒక్కో సెంటర్ కోసం 30 కోట్ల రూపాయల మేర పెట్టుబడి పెట్టినట్లు కంపెనీ సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ మంగేష్ పాండే తెలిపారు. గతేడాది హైదరాబాద్ సెంటర్ లో 15 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించామని, ప్రతి నెలా సుమారు 35 వేల మంది విజిటర్స్‌ వస్తుంటారని ఆయన తెలిపారు.  ఈ సెంటర్‌లో ఆటలు, సంగీతం, విందు వినోదాలతో కూడిన గేమింగ్‌ అనుభూతిని పొందవచ్చని , ఔత్సాహిక క్రికెట్‌ ప్రేమికుల కోసం కొత్త గేమ్స్‌ ప్రవేశపెట్టామని, కార్పోరేట్ కంపెనీల నుంచి మంచి స్పందన వస్తోందని మంగేష్ అన్నారు.Most Popular