కర్దా కన్‌స్ట్రక్షన్స్‌... నష్టాల లిస్టింగ్‌!

కర్దా కన్‌స్ట్రక్షన్స్‌... నష్టాల లిస్టింగ్‌!

ఇటీవలే పబ్లిక్‌ ఇష్యూ పూర్తిచేసుకున్న కర్దా కన్‌స్ట్రక్షన్స్‌  లిస్టింగ్‌లో ఇన్వెస్టర్లను నిరాశపరచింది. ఇష్యూ ధర రూ. 180కాగా.. బీఎస్ఈలో 24 శాతం(రూ. 44) నష్టంతో రూ. 136 వద్ద లిస్టయ్యింది. ప్రస్తుతం రూ. 143 వద్ద ట్రేడవుతోంది. ఇష్యూకి 2.5 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలుకాగా.. తద్వారా రూ. 77 కోట్లను సమీకరించింది. ఇష్యూ నిధులను పాక్షిక రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ వ్యవహారాల కోసం వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కర్దా కన్‌స్ట్రక్షన్స్‌ పేర్కొంది.
బ్యాక్‌గ్రౌండ్‌
నాసిక్ కేంద్రంగా పనిచేస్తోన్న కర్దా కన్‌స్ట్రక్షన్ 1994లో నిర్మాణ రంగ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. మొదట్లో సింగిల్ బెడ్‌రూమ్‌ల కన్‌స్ట్రక్షన్‌పైనే దృష్టి పెట్టిన ఈ సంస్థ క్రమక్రమంగా కొత్త కాలనీలు, భవంతులను నిర్మించే స్థాయికి ఎదిగింది. హరి సంస్కృతి, హరి గోకులధామ్, హరి ఆనంద్, హరికృష్ణ తదితర పలు ప్రాజెక్టులను పూర్తి చేసింది.  2016తో పోలిస్తే 2017తో ముగిసిన సంవత్సరానికి 30 శాతం వృద్ధితో రూ.8 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఇదే సమయంలో ఆదాయం మాత్రం 4శాతమే పెరిగింది. Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');