సంధార్‌ టెక్నాలజీస్‌ లిస్టింగ్‌ ఓకే!

సంధార్‌ టెక్నాలజీస్‌ లిస్టింగ్‌ ఓకే!

ఇటీవలే పబ్లిక్‌ ఇష్యూ పూర్తిచేసుకున్న సంధార్‌ టెక్నాలజీస్‌ స్వల్ప లాభాలతో స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యింది. మార్చి 21న ముగిసిన ఇష్యూ ధర  రూ. 332కాగా.. బీఎస్ఈలో రూ. 349 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఇది 5 శాతం(రూ. 17) ప్రీమియంకాగా.. ప్రస్తుతం రూ. 345 వద్ద ట్రేడవుతోంది. ఇష్యూకి 6.2 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలుకాగా... తద్వారా సంధార్‌ టెక్నాలజీస్‌ రూ. 500 కోట్లకుపైగా సమీకరించింది. ఇష్యూలో భాగంగా యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 154 కోట్లను సమీకరించింది.

బ్యాక్‌గ్రౌండ్‌
వాహనాల భద్రత, రక్షణకు తోడ్పడే వివిధ రకాల విడిభాగాలను సంధార్‌ టెక్నాలజీస్‌ ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఈ కంపెనీ 33 మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్స్‌లో దాదాపు 6500 మంది కార్మికులు పనిచేస్తున్నారు.  అలాగే స్పెయిన్‌లో 2, మెక్సికోలో ఒకటి చొప్పున తయారీ కేంద్రాలు ఉన్నాయి. హీరో, టీవీఎస్‌, సుజూకి, యమహా, హోండా వంటి వాహన తయారీ దిగ్గజాలు ఈ కంపెనీ క్లయింట్స్‌గా ఉన్నాయి.

ఫైనాన్షియల్స్‌ 
గత ఐదేళ్ళుగా సంధార్‌ టెక్నాలజీస్‌ మైరుగైన, స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోంది. 2017తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.1634 కోట్ల ఆదాయంపై రూ.39.6 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. అంతకు ముందు ఏడాది  కంపెనీ ఆదాయం రూ.1518 కోట్లు కాగా, నికరలాభం రూ.33.7 కోట్లుగా ఉంది. Most Popular