యువతకు మెరుగైన శిక్షణ అవసరం : డా. లౌరీ కాన్‌స్టాంట్‌ 

యువతకు మెరుగైన శిక్షణ అవసరం : డా. లౌరీ కాన్‌స్టాంట్‌ 

నైపుణ్యాభివృద్థి కార్యక్రమాల ద్వారా యువతకు మెరుగైన శిక్షణను అందించాలని పార్డీ ర్యాండ్‌ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ప్రొఫెసర్‌ లౌరీ కాన్‌స్టాంట్‌ అన్నారు. దేశంలో నిపుణుల కొరతను తగ్గించేందుకు ప్రభుత్వంతో కలిసి నైపుణ్యవంతులను తీర్చిదిద్దేందుకు కంపెనీలు ముందుకు రావాలన్నారు. ప్రభుత్వం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం నిధులిస్తే సరిపోదని, అవి సత్ఫలితాలు వచ్చేలా కృషి చేయాలన్నారు. కళాశాలల్లో డిగ్రీ స్థాయి కోర్సులతో పాటు ప్రత్యేకంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై శిక్షణ అందిస్తే, భారత్‌ ఆర్థికంగా చక్కని వృద్ధిని నమోదు చేస్తుందని లౌరీ కాన్‌స్టాంట్‌ చెప్పారు. 
 Most Popular