అప్పుల ఊబిలో చిక్కుకుంటే.. బయటపడేందుకు చక్కని చిట్కాలు

అప్పుల ఊబిలో చిక్కుకుంటే.. బయటపడేందుకు చక్కని చిట్కాలు

తమ అప్పులను కన్సాలిడేట్ చేసుకునేందుకు ఇప్పుడు అనేక మంది రుణ గ్రహీతలు పీర్-టు-పీర్ వ్యవస్థను ఆశ్రయిస్తున్నారు. హోం రినోవేషన్‌కు అధికంగా రుణాలు తీసుకుంటున్నారని లెన్‌డెన్ క్లబ్ వంటి పీ2పీ లెండింగ్ ప్లాట్‌ఫామ్స్ చెబుతున్నాయి. ఈ తరం యువత ఎక్కువగా రుణాలను చేసేయడం.. ముఖ్యంగా క్రెడిట్ కార్డులను భారీగా ఉపయోగించి వాటి బకాయిలను తీర్చేందుకు రుణాలు చేయడం ఎక్కువగా కనిపిస్తోంది.
పీ2పీ ప్లాట్‌ఫామ్స్‌లో రుణాలు తీసుకుంటున్నవారిలో ఎక్కువగా 25-34 సంవత్సరాల ఏజ్ గ్రూప్ వారే ఉంటున్నారు. గత రెండేళ్లుగా క్రెడిట్ కార్డ్ బకాయిలు, పర్సనల్ లోన్స్ పెరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ గణాంకాలు తెలుపుతున్నాయి.

ఒక వేళ మరీ రుణాల ఊబిలో చిక్కుకుంటే వాటి నుంచి బయట పడేందుకు ఈ మార్గాలను అనుసరించి సత్ఫలితాలను పొందవచ్చు

 

  • జీవిత బీమా పాలసీ లేదా వేరే ఏదైనా ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌పై రుణాలను తీసుకోండి. వీటిపై వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నా ఎగ్జిట్ ఫీజు మాత్రం అధికంగా ఉంటుంది. 9-14 శాతం వడ్డీతోనే రుణాలను పొందవచ్చు.
  • పర్సనల్ లోన్స్‌పై ప్రస్తుతం 15-22 శాతం వడ్డీ విధిస్తుండగా.. క్రెడిట్ కార్డు బకాయిలపై 48శాతం వరకూ చెల్లించాల్సి వస్తోంది.
  • క్రెడిట్ కార్డ్ బకాయితో పాటు హోమ్ లోన్ లేదా కార్ లోన్ ఉన్నట్లయితే, ఆయా రుణాల కాల వ్యవధిని పొడిగించడం ద్వారా చెల్లించాల్సిన మొత్తాన్ని తగ్గించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.
  • నెలవారీ చెల్లింపు మొత్తాన్ని తగ్గించుకుంటే.. క్రెడిట్ కార్డు బకాయిలను చెల్లించేందుకు మీకు అధికంగా డబ్బు చేతిలో కనిపించే అవకాశం ఉంటుంది.
  • రుణాలను చెల్లించేటపుడు మొదటగా అధిక వడ్డీ చెల్లించాల్సిన వాటిపై దృష్టి సారించాల్సి ఉంటుంది. అంటే మొదటగా క్రెడిట్ కార్డు బకాయిలు, ఆ తర్వాత పర్సనల్ లోన్స్, కారు రుణాలు.. చివరగా హోమ్ లోన్‌పై దృష్టి పెట్టాలి.
  • క్రెడిట్ కార్డ్ బకాయిలను చెల్లించేందుకు మినిమం అమౌంట్‌ను చెల్లిస్తే సరిపోతుందనే భావనతో మాత్రం ఉండకండి.

  •  


Most Popular