హైదరాబాద్ కేంద్రంగా పీవీసీ పైపుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన స్కిప్పర్

హైదరాబాద్ కేంద్రంగా పీవీసీ పైపుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన స్కిప్పర్


పీవీసీ పైపుల తయారీలో ఉన్న స్కిప్పర్ లిమిటెడ్ దక్షిణాది మార్కెట్లోకి అడుగుపెడుతోన్నట్లు ప్రకటించింది.  ఇప్పటికే  హైదరాబాద్ కేంద్రంగా పాలిమర్ పైపుల తయారీ కేంద్రం ప్రారంభించిన ఈ కంపెనీ  ఉత్పత్తి సామర్థ్యం 6వేల మెట్రిక్ టన్నులుగా ఉంది. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ లో  10 కోట్ల రూపాయల మేర పెట్టుబడి పెట్టామని.. తమకు ఇది ఐదోవ ప్లాంట్ అని దేశవ్యాప్తంగా ఇప్పటికే పీవీసీ పైపులు, ఫిట్టింగ్స్ తయారీ ప్లాంట్లు నాలుగున్నాయని కంపెనీ డైరెక్టర్ దేవేశ్ బన్సాల్ తెలిపారు.   తెలంగాణ ప్లాంట్ ద్వారా దక్షిణాది మార్కెట్లోకి ప్రవేశిస్తున్నామని వచ్చే ఐదేళ్ళలో 7 శాతం మార్కెట్ వాటా సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు. దేశవ్యాపంగా పీవీసీ పైపుల మార్కెట్ సైజ్ 16వేల కోట్ల రూపాయలుగా ఉందని, ప్రతి ఏటా 8 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేస్తోందని దేవేశ్ తెలిపారు.Most Popular